ప్రపంచంలోనే అత్యంత విలువైన కంపెనీగా యాపిల్ మరోసారి అగ్రస్థానాన్ని కైవసం చేసుకుంది. కృత్రిమ మేధ (ఏఐ) రంగంలో భారీ పెట్టుబడులు పెడుతున్న ఇతర బిగ్ టెక్ సంస్థలతో పోలిస్తే.. ఏఐ మౌలిక వసతులపై తక్కువగా ఖర్చు చేస్తున్నప్పటికీ, మార్కెట్ విలువలో చిప్ దిగ్గజం ఎన్‌విడియాను యాపిల్ అధిగమించింది.
సోమవారం ఎన్‌విడియా షేర్లు సుమారు 5 శాతం పడిపోవడంతో ఆ సంస్థ మార్కెట్ విలువ 4.77 లక్షల కోట్ల డాలర్లకు చేరింది. అదే సమయంలో యాపిల్ షేర్లు రాణించడంతో కంపెనీ మార్కెట్ విలువ 4.95 లక్షల కోట్ల డాలర్లకు పెరిగింది. దీంతో ప్రపంచంలోనే అత్యంత విలువైన కంపెనీగా యాపిల్ నిలిచింది.
గత ఏడాది కాలంగా ఎన్‌విడియా ఈ స్థానాన్ని కొనసాగిస్తూ వచ్చింది. ఏఐ నమూనాలకు అవసరమైన గ్రాఫిక్స్ ప్రాసెసింగ్ యూనిట్లకు భారీ డిమాండ్ రావడం ఆ సంస్థకు గణనీయంగా కలిసొచ్చింది. 2025 అక్టోబరులో తొలిసారిగా 5 లక్షల కోట్ల డాలర్ల మార్కెట్ విలువను దాటిన తొలి కంపెనీగా కూడా ఎన్‌విడియా నిలిచింది.
అయితే ప్రస్తుతం ఏఐ మౌలిక వసతుల కోసం భారీగా చేస్తున్న ఖర్చులకు తగిన ప్రతిఫలం లభిస్తుందా అనే అంశంపై ఇన్వెస్టర్లలో ఆందోళనలు పెరుగుతున్నాయి. ఏఐ విస్తరణకు సంబంధించిన ఆర్థిక భారం పెరుగుతుందనే సందేహాలు కూడా ఎన్‌విడియా షేర్లపై ప్రభావం చూపుతున్నాయి.
మరోవైపు యాపిల్ వ్యూహం భిన్నంగా ఉంది. మైక్రోసాఫ్ట్, అమెజాన్, మెటా వంటి బిగ్ టెక్ సంస్థలతో పోలిస్తే.. గత మూడు త్రైమాసికాల్లో డేటా సెంటర్లు, ఏఐ మౌలిక వసతులపై మూలధన వ్యయాలను యాపిల్ తగ్గించింది. ఈ వ్యూహంపై తొలుత విమర్శలు వచ్చినప్పటికీ, తాజాగా కంపెనీ షేర్లలో వచ్చిన ర్యాలీ యాపిల్‌ను మళ్లీ ప్రపంచంలోనే అత్యంత విలువైన కంపెనీగా నిలబెట్టింది.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsToday NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews WorldNews



















