ఒక చిన్న ఏటిపై చాలా ఇరుకైన కర్ర వంతెన ఉండేది. ఆ వంతెనపై ఒకేసారి ఒక్క మేక మాత్రమే నడవగలదు. ఒకరోజు వంతెనకు ఒకవైపు నుంచి తెల్ల మేక, మరోవైపు నుంచి నల్ల మేక వచ్చాయి. రెండూ వంతెన మధ్యలో ఎదురెదురుగా నిలబడటంతో ముందుకు వెళ్లేందుకు, వెనక్కి తిరిగేందుకు అవకాశం లేకుండా పోయింది.
ముందుగా తానే వచ్చానంటూ తెల్ల మేక, తాను అప్పటికే సగం దూరం వచ్చేశానంటూ నల్ల మేక ఒకదానితో ఒకటి వాదించుకున్నాయి. ఎవ్వరూ వెనక్కి తగ్గేందుకు సిద్ధపడలేదు. మాటామాటా పెరిగి చివరకు కొమ్ములతో పోరాడటం ప్రారంభించాయి. ఈ క్రమంలో రెండింటి సమతుల్యత తప్పి లోతైన ఏటి నీటిలో పడిపోయాయి.
నీతి: చిన్న సమస్యను పట్టుదల, అహంకారంతో పెద్దదిగా చేసుకుంటే చివరికి ఇద్దరికీ నష్టమే. కొన్నిసార్లు ఒక అడుగు వెనక్కి తగ్గడం ఓటమి కాదు.. తెలివైన నిర్ణయం
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsToday NewsUpdate PoliticalNews PublicSafety shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews WorldNews



















