దేశంలోని ప్రముఖ పరిశోధన సంస్థల్లో ఉన్నత విద్యను అభ్యసించాలనుకునే విద్యార్థులకు గొప్ప అవకాశం లభించింది. జాతీయ ప్రాధాన్య సంస్థ ఏసీఎస్‌ఐఆర్ (Academy of Scientific and Innovative Research) పీహెచ్‌డీ, ఇంటిగ్రేటెడ్ ఎంటెక్–పీహెచ్‌డీ, ఎంటెక్ కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.
ఈ కోర్సుల ద్వారా ఎంపికైన అభ్యర్థులు దేశవ్యాప్తంగా ఉన్న 80కి పైగా సీఎస్‌ఐఆర్ కేంద్రాల్లో చదువు, పరిశోధనలు కొనసాగించే అవకాశం పొందుతారు. అంతేకాకుండా ప్రతి నెలా స్టైపెండ్ కూడా అందుతుంది. పీహెచ్‌డీ కోర్సులకు ఇంజినీరింగ్ లేదా సైన్స్ సంబంధిత మాస్టర్స్ డిగ్రీ అవసరం. అలాగే CSIR, UGC, DST, DBT వంటి జాతీయ సంస్థల JRF అర్హత తప్పనిసరి. ఇంటిగ్రేటెడ్ ఎంటెక్–పీహెచ్‌డీ కోసం బీటెక్ లేదా ఎమ్మెస్సీ పూర్తి చేసినవారు అర్హులు. GATE లేదా NET వంటి పరీక్షల్లో అర్హత సాధించాలి. ఎంటెక్ కోర్సులకు బీటెక్ లేదా నాలుగేళ్ల సైన్స్ డిగ్రీ అవసరం, అలాగే జాతీయ స్థాయి పరీక్షల అర్హత తప్పనిసరి.
దరఖాస్తుల షార్ట్‌లిస్టింగ్ తర్వాత అభ్యర్థులకు ఆప్టిట్యూడ్ టెస్ట్ లేదా ఇంటర్వ్యూ నిర్వహించి ఎంపిక చేస్తారు. ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ ఏప్రిల్ 30 కాగా, కొన్ని కోర్సులకు మే 31 వరకు అవకాశం ఉంది. వివరాలకు అధికారిక వెబ్‌సైట్: http://acsir.emli.in
Andhra pradesh Andhrapradesh AndhraPradeshNews APNews Breaking news BreakingNews BusinessNews ChandrababuNaidu CricketNews CrimeNews EntertainmentNews Geopolitics governance Government India IndiaNews LatestNews LawAndOrder News news24 newsalert NewsToday NewsUpdate PoliticalNews PoliticalUpdate PublicSafety shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews Telangana TelanganaNews TeluguNews Tollywood TrendingNews TrendingNow ViralNews WorldNews



















