గత వారం చివర్లో నష్టాలను చవిచూసిన దేశీయ సూచీలు ఈ వారాన్ని లాభాలతో ప్రారంభించాయి. ఇరాన్-అమెరికా యుద్ధం ముగింపు దశకు చేరుకున్నట్టు ఆదివారం నాడు ట్రంప్ వ్యాఖ్యానించడం పాజిటివ్‌గా మారింది. అలాగే ఇరాన్ కూడా శాంతి చర్చల కోసం ఆసక్తి చూపుతుండడంతో అంతర్జాతీయ మార్కెట్లకు కలిసొచ్చింది. ఈ రోజు ఆసియా మార్కెట్లన్నీ దాదాపు ఒక శాతానికి పైగా లాభపడ్డాయి. ఈ నేపథ్యంలో ప్రస్తుతం సెన్సెక్స్, నిఫ్టీ లాభాల్లో కదలాడుతున్నాయి
గత సెషన్ ముగింపు (76,664)తో పోల్చుకుంటే సోమవారం ఉదయం దాదాపు 200 పాయింట్ల లాభంతో మొదలైన సెన్సెక్స్ ఆ తర్వాత మరింత పైకి ఎగబాకింది. ఉదయం 10:00 గంటల సమయంలో సెన్సెక్స్ 625 పాయింట్ల లాభంతో 77,289 వద్ద కొనసాగుతోంది. మరో వైపు నిఫ్టీ కూడా లాభాల బాటలోనే సాగుతోంది. ప్రస్తుతం 203 పాయింట్ల లాభంతో 24,101 వద్ద కదలాడుతోంది
సెన్సెక్స్, నిఫ్టీలో సన్ ఫార్మా, టొరెంట్ పవర్, అల్కెమ్ ల్యాబ్స్, హిందుస్థాన్ జింక్, ఒరాకిల్ ఫిన్‌సెర్వ్ మొదలైన షేర్లు లాభాల్లో ఉన్నాయి పేటీఎమ్, యాక్సిస్ బ్యాంక్, శ్రీరామ్ ఫైనాన్స్, ఆర్బీఎల్ బ్యాంక్, ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ మొదలైన షేర్లు నష్టాల బాటలో సాగుతున్నాయి. నిఫ్టీ మిడ్ క్యాప్ ఇండెక్స్ 880 పాయింట్ల లాభంతో ఉంది. బ్యాంక్ నిఫ్టీ 183 పాయింట్ల లాభంతో ఉంది. డాలర్‌తో పోల్చుకుంటే రూపాయి మారకం విలువ 94.21గా ఉంది.
Andhra pradesh Andhrapradesh AndhraPradeshNews APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EntertainmentNews Geopolitics Government India IndiaNews InternationalNews LatestNews LawAndOrder MarketUpdate News news24 newsalert NewsToday NewsUpdate PoliticalNews PublicSafety shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews WorldNews



















