టికెట్ రిజర్వేషన్ చేసుకున్న ప్రయాణికులు బస్టాండ్‌కు వెళ్లాల్సిన అవసరం లేకుండా వారి ఇంటి వద్దకే బస్సును పంపించే వినూత్న కార్యక్రమానికి ఏపీఎస్‌ఆర్టీసీ శ్రీకారం చుడుతోంది. ఈ సదుపాయాన్ని తొలుత విజయవాడ నగర పరిధిలోని ప్రయాణికులకు అందుబాటులోకి తీసుకొచ్చినట్లు ఎన్టీఆర్ జిల్లా ప్రజారవాణాధికారిణి వి. నీలిమ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు.
ప్రస్తుతం విజయవాడ-హైదరాబాద్ మార్గంలో ప్రయోగాత్మకంగా ఈ సదుపాయాన్ని అమలు చేస్తున్నట్లు పేర్కొన్నారు. కనీసం ఆరుగురు లేదా అంతకంటే ఎక్కువ మంది ప్రయాణికులు కలిసి ప్రయాణించాలనుకుంటే ఈ సేవను వినియోగించుకోవచ్చని తెలిపారు. ఇప్పటికే అంతర్జాలం ద్వారా లేదా ఆర్టీసీ కౌంటర్లలో టికెట్లు రిజర్వ్ చేసుకున్నవారితోపాటు రిజర్వేషన్ చేసుకోవాలనుకునే ప్రయాణికులు కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవచ్చన్నారు.
ప్రయాణికులు ఎక్కాల్సిన ప్రదేశం నుంచి బస్టాండ్ వరకు ఉన్న దూరానికి అనుగుణంగా అదనపు టికెట్ రుసుము చెల్లించాల్సి ఉంటుందని తెలిపారు. దీంతో ప్రయాణికులు ప్రత్యేకంగా బస్టాండ్‌కు చేరుకోవాల్సిన అవసరం లేకుండా తమకు అనుకూలమైన ప్రాంతం నుంచి బస్సులో ఎక్కే అవకాశం కలుగుతుంది.
ఈ సదుపాయం కావాలనుకునే ప్రయాణికులు ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 6 గంటల మధ్య సంబంధిత అధికారులను సంప్రదించాలని సూచించారు. తాము ఎక్కాల్సిన బస్సు బయలుదేరే సమయానికి కనీసం నాలుగు గంటల ముందుగా 73828 25450, 99592 25450 నంబర్లకు ఫోన్ చేసి వివరాలు తెలియజేయాలని కోరారు.
మరోవైపు విజయవాడ నుంచి ఏపీ హైకోర్టుకు వెళ్లే బస్సు సర్వీసుల్లోనూ మార్పులు చేసినట్లు ప్రజారవాణాధికారిణి తెలిపారు. విజయవాడ పీఎన్‌బీఎస్ నుంచి ఉదయం 9.10 గంటలకు బయలుదేరే బస్సును సీడ్ యాక్సిస్ రోడ్డు, సీఆర్‌డీఏ మీదుగా ఏపీ హైకోర్టుకు వెళ్లేలా మార్గాన్ని మార్చారు.
అదేవిధంగా ఉదయం 9.25 గంటలకు ఉండవల్లి సెంటర్ నుంచి వయా పెనుమాక, మందడం మీదుగా ఏపీ హైకోర్టుకు వెళ్లేలా అదనపు ట్రిప్‌ను ఏర్పాటు చేశారు. ఈ మార్పు సోమవారం నుంచే అమల్లోకి వచ్చినట్లు అధికారులు తెలిపారు. హైకోర్టు పరిసర ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులు ఈ అదనపు ట్రిప్‌ను వినియోగించుకోవచ్చని సూచించారు.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews Wellness WorldNews

















