భూతాపం పెరుగుదల ప్రభావం ఎల్ నినో ఘటనలపై స్పష్టంగా కనిపిస్తోందని అమెరికాలోని మిషిగన్ విశ్వవిద్యాలయ పరిశోధకుల అధ్యయనం వెల్లడించింది. పారిశ్రామిక యుగానికి ముందు కాలంతో పోలిస్తే గత 40 ఏళ్లలో ఎల్ నినో ఘటనల తీవ్రత దాదాపు 40 శాతం పెరిగినట్లు పరిశోధకులు గుర్తించారు. ఈ పరిణామం భూతల, సముద్ర ఉష్ణోగ్రతల పెరుగుదలతో పాటు వరదలు, అనావృష్టి వంటి తీవ్ర వాతావరణ పరిస్థితులకు దారితీసే అవకాశం ఉంది.
ఈ అధ్యయనం కోసం ఈక్వెడార్ తీరానికి సుమారు 1,000 కిలోమీటర్ల దూరంలోని గాలాపాగోస్ దీవుల్లో ఆధునిక, పురాతన పగడాలను పరిశీలించారు. పరిశోధకులు మొత్తం 13 పగడాల నమూనాలను సేకరించారు. పగడాలు ప్రతి ఏడాది ఒకటి నుంచి రెండు సెంటీమీటర్ల మేర పెరుగుతూ కాల్షియం కార్బోనేట్ పొరలను ఏర్పరుస్తాయి. ఈ పొరలను విశ్లేషించడం ద్వారా గతంలో సముద్రపు నీటి ఉష్ణోగ్రతల్లో వచ్చిన మార్పులను అంచనా వేయవచ్చు.
గత వెయ్యేళ్లలో అగ్నిపర్వత విస్ఫోటనాలు, సౌర తుపానులు వంటి సహజ కారణాల వల్ల ఎల్ నినో తీవ్రతలో గణనీయమైన పెరుగుదల కనిపించలేదని పరిశోధకులు తెలిపారు. దీంతో ఇటీవలి కాలంలో ఎల్ నినో తీవ్రత పెరగడానికి మానవ కార్యకలాపాల కారణంగా పెరుగుతున్న భూతాపమే ప్రధాన కారణమని అధ్యయనం సూచిస్తోంది. భవిష్యత్తులో ఎల్ నినో కారణంగా పారిశ్రామిక యుగానికి పూర్వం ఉష్ణోగ్రతల కంటే 1.7–1.8 డిగ్రీల సెల్సియస్ అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని మిషిగన్ విశ్వవిద్యాలయానికి చెందిన జూలియా కోల్ తెలిపారు.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews Wellness WorldNews



















