కృత్రిమ మేధ (ఏఐ) డేటా సెంటర్లపై అంతర్జాతీయ టెక్ దిగ్గజ సంస్థలు భారీగా పెట్టుబడులు పెడుతున్న నేపథ్యంలో వాటి రాబడులు, ప్రయోజనాలపై ప్రపంచవ్యాప్తంగా చర్చ కొనసాగుతోంది. “ఏఐ డేటా సెంటర్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ బబుల్” అనే అంశంపై జోహో కార్పొరేషన్ వ్యవస్థాపకుడు, చీఫ్ సైంటిస్ట్ శ్రీధర్ వెంబు సోమవారం ‘ఎక్స్’ వేదికగా తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.
టెక్ రంగంలో లక్షల కోట్ల డాలర్లతో జరుగుతున్న ఏఐ డేటా సెంటర్ల నిర్మాణ వ్యయాన్ని ఐబీఎం సీఈఓ అరవింద్ కృష్ణ ఇప్పటికే ప్రశ్నించిన విషయాన్ని వెంబు ప్రస్తావించారు. గ్లోబల్ మార్కెట్‌లో అందరూ అనుసరిస్తున్న దారిని కాకుండా, జోహో సంస్థ అత్యంత జాగ్రత్తగా, లెక్కలతో కూడిన వ్యూహాన్ని అనుసరిస్తోందని ఆయన స్పష్టం చేశారు. భారీ పెట్టుబడులతో డేటా సెంటర్ల నిర్మాణం ఒక “బబుల్”గా మారే ప్రమాదం ఉందని అరవింద్ కృష్ణ అభిప్రాయపడిన నేపథ్యంలో, అలాంటి పెట్టుబడుల వెంట తాము వెళ్లబోమని వెంబు తేల్చిచెప్పారు.
భారీ డేటా సెంటర్లపై ఖర్చు చేయడం కంటే, ఏఐ ఔట్‌పుట్‌ను ఖచ్చితంగా వెరిఫై చేయడానికి అవసరమైన డేటా క్యూరేషన్, రీఇన్‌ఫోర్స్‌మెంట్ లెర్నింగ్, కంపైలర్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ వంటి కీలక సామర్థ్యాలపై జోహో పెట్టుబడులు పెడుతోందని ఆయన వివరించారు. దీన్ని “సాధారణ వివేకం”గా అభివర్ణించారు.
“మా మాటలు కొంతమందికి ఓటమిని అంగీకరించినట్లు అనిపించవచ్చు. కానీ ఐదేళ్ల తర్వాత ఈ విషయంపై మళ్లీ మాట్లాడుకుందాం” అని వెంబు పేర్కొన్నారు.
ఇదిలా ఉండగా, ఓపెన్‌ఏఐ, మైక్రోసాఫ్ట్, గూగుల్ వంటి సంస్థలు జనరేటివ్ ఏఐ మోడల్స్, ప్రత్యేక చిప్స్, భారీ డేటా సెంటర్ల కోసం వందల కోట్ల డాలర్ల పెట్టుబడులు పెడుతున్నాయి. అయితే ఈ పెట్టుబడులకు సరితూగే ఆదాయం వస్తుందా అనే అంశంపై నిపుణుల మధ్య ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో అరవింద్ కృష్ణ, శ్రీధర్ వెంబు వ్యాఖ్యలు టెక్ రంగంలో ప్రాధాన్యం సంతరించుకున్నాయి.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EntertainmentNews Geopolitics Government India IndiaNews InternationalNews LatestNews LawAndOrder MarketUpdate MovieNews News news24 newsalert NewsToday NewsUpdate PoliticalNews PublicSafety shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews WorldNews

















