కడప జిల్లా ఖాజీపేటలో జరిగిన దారుణ ఘటనలో ప్రేమోన్మాది వెంకటేశ్‌పై పోలీసులు కాల్పులు జరిపారు. బాలికను హత్య చేసిన కేసులో అరెస్టయిన వెంకటేశ్‌ను శనివారం తెల్లవారుజామున ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి తరలిస్తున్న సమయంలో అతడు పోలీసుల కస్టడీ నుంచి తప్పించుకునేందుకు ప్రయత్నించాడు.ఈ క్రమంలో ఇద్దరు కానిస్టేబుళ్లపై దాడి చేసి గాయపరిచాడు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు అతడిని అడ్డుకునేందుకు మూడు రౌండ్లు గాల్లోకి కాల్పులు జరిపారు. అయినప్పటికీ నిందితుడు ప్రతిఘటించడంతో పరిస్థితిని నియంత్రించేందుకు అతడి కాళ్లపైకి కాల్పులు జరిపారు.గాయపడిన వెంకటేశ్‌ను వెంటనే కడప రిమ్స్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనతో ఖాజీపేట ప్రాంతంలో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది.
మరోవైపు, ఈ కేసు తీవ్ర సంచలనం సృష్టిస్తోంది. ఖాజీపేట అగ్రహారం గ్రామానికి చెందిన 17 ఏళ్ల బాలికను, ఆమె ఇంట్లో ఎవరూ లేని సమయంలో వెంకటేశ్ ప్రేమ పేరుతో వేధించి దారుణంగా హత్య చేసిన విషయం తెలిసిందే. ఆమె నిరాకరించడంతో కక్ష పెంచుకున్న నిందితుడు ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు.గాయాలతో ఆసుపత్రికి తరలించే సమయంలో బాలిక తన తండ్రి వద్ద నిందితుడి పేరును ప్రస్తావించినట్లు సమాచారం. మార్గమధ్యంలో ఆమె మృతి చెందడంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsToday NewsUpdate PoliticalNews PublicSafety shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews WorldNews

















