అగ్ర కథానాయకుడు నందమూరి బాలకృష్ణ నటిస్తున్న 111వ చిత్రం ముంబయి నేపథ్యంలో సాగే కథతో తెరకెక్కుతోంది. ఈ సినిమాకు గోపీచంద్ మలినేని దర్శకత్వం వహిస్తుండగా, వృద్ధి సినిమాస్ పతాకంపై వెంకట సతీశ్ కిలారు నిర్మిస్తున్నారు. ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్న ఈ ప్రాజెక్ట్ కోసం ఈ వారంలోనే బాలకృష్ణ ముంబయిలో అడుగు పెట్టనున్నట్లు సమాచారం.
ఈ షెడ్యూల్ సుదీర్ఘంగా కొనసాగనుంది. ఇందులో ప్రధాన తారాగణంపై కీలక సన్నివేశాలతో పాటు భారీ స్థాయిలో యాక్షన్ సీక్వెన్సులను చిత్రీకరించనున్నట్లు తెలుస్తోంది. ముంబయి బ్యాక్‌డ్రాప్‌లో సాగే ఈ కథలో బాలకృష్ణ ఓ శక్తివంతమైన గ్యాంగ్‌స్టర్ పాత్రలో కనిపించనున్నారని సినీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ఆయన పాత్రలో మాస్ అంశాలు, యాక్షన్ ఎలిమెంట్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయని సమాచారం.
ఈ చిత్రంలో బాలకృష్ణ సరసన కాజల్ అగర్వాల్ నటిస్తున్నారు. విజయవంతమైన ‘వీరసింహారెడ్డి’ తర్వాత బాలకృష్ణ–గోపీచంద్ మలినేని కలయికలో వస్తున్న ఈ సినిమా కావడంతో అంచనాలు మరింత పెరిగాయి. ఇద్దరి శైలికి తగ్గట్టుగా మాస్, కమర్షియల్ అంశాలను మేళవించి ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నట్లు చిత్రబృందం వర్గాలు చెబుతున్నాయి.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews Wellness WorldNews



















