తూర్పు తీరాన్ని పోర్టు ఆధారిత ఆర్థిక వ్యవస్థగా, షిప్‌బిల్డింగ్ హబ్‌గా అభివృద్ధి చేయడమే లక్ష్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కేంద్రంతో పాటు పరిశ్రమలతో సమన్వయంగా పనిచేస్తోందని రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్య శాఖ మంత్రి బీసీ జనార్దన్‌రెడ్డి తెలిపారు.
ఈ మేరకు ఆయన దిల్లీలో కేంద్ర పోర్టులు, షిప్పింగ్, జలమార్గాల శాఖ మంత్రి సర్బానంద సోనోవాల్‌ను ఆయన కార్యాలయంలో కలిశారు. రాష్ట్రంలో అమలు చేస్తున్న మారిటైమ్ అభివృద్ధి ప్రాజెక్టుల పురోగతిని వివరించారు.
ఏపీలో సమగ్ర మారిటైమ్ ఎకోసిస్టమ్ అభివృద్ధికి కేంద్ర సహకారం అవసరమని మంత్రి బీసీ జనార్దన్‌రెడ్డి కోరారు. గ్రీన్‌ఫీల్డ్ పోర్టుల అభివృద్ధి, షిప్‌బిల్డింగ్ క్లస్టర్ల ఏర్పాటు, నౌక మరమ్మతు కేంద్రాలు, ఫిషింగ్ హార్బర్లు, ఫిష్ ల్యాండింగ్ సెంటర్ల అభివృద్ధిపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టిందని తెలిపారు. అలాగే పోర్టు ఆధారిత పరిశ్రమలకు మౌలిక సదుపాయాలు, పోర్టు కనెక్టివిటీ ప్రాజెక్టులను వేగవంతం చేస్తున్నట్లు వివరించారు.
ఈ సమావేశంలో పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు కూడా పాల్గొన్నారు. రాష్ట్ర మారిటైమ్ రంగ అభివృద్ధికి కేంద్ర సహకారం మరింత బలపడుతుందని ఈ సందర్భంగా నేతలు ఆశాభావం వ్యక్తం చేశారు.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsToday NewsUpdate PoliticalNews PublicSafety shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews WorldNews



















