ఆంధ్రప్రదేశ్ గవర్నర్ అబ్దుల్ నజీర్‌తో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ శుక్రవారం సాయంత్రం భేటీ అయ్యారు. విజయవాడలోని లోక్‌భవన్‌లో ఈ సమావేశం జరిగింది. రాష్ట్ర పరిపాలన, అభివృద్ధి అంశాలు సహా పలు కీలక విషయాలపై ఇరువురి మధ్య చర్చలు జరిగినట్లు సమాచారం.
ఈ సందర్భంగా గవర్నర్‌తో వివిధ అంశాలపై అభిప్రాయాలు పంచుకున్నట్లు పవన్ కల్యాణ్ తెలిపారు. సమావేశం ఆహ్లాదకర వాతావరణంలో, ఫలవంతంగా జరిగిందని ఆయన పేర్కొన్నారు. గవర్నర్ నుంచి విలువైన మార్గదర్శనం లభించినట్లు పవన్ కల్యాణ్ ‘ఎక్స్’ వేదికగా స్పందించారు.
రాష్ట్ర పాలనలో సమన్వయం, ప్రజాసంక్షేమ కార్యక్రమాల అమలు, అభివృద్ధి ప్రణాళికలపై కూడా ఈ భేటీలో చర్చ జరిగినట్లు భావిస్తున్నారు.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsToday NewsUpdate PoliticalNews PublicSafety shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews WorldNews



















