ChatGPT, Google Gemini, Perplexity AI వంటి కృత్రిమ మేధ ఆధారిత చాట్‌బాట్లు ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా విస్తృతంగా వినియోగంలోకి వచ్చాయి. రోజువారీ పనులు, సమాచారం సేకరణ, రచనలు, విద్య, సృజనాత్మకత వంటి అనేక రంగాల్లో ఇవి ప్రజలకు సహాయపడుతున్నాయి. అయితే ఏఐ బాట్ల వినియోగంలో అప్రమత్తత చాలా అవసరమని సైబర్ నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ముఖ్యంగా వ్యక్తిగత సమాచారం, బ్యాంకు వివరాలు, పాస్‌వర్డ్‌లు, ఆరోగ్య సంబంధిత రహస్యాలు, కంపెనీ డేటా వంటి సున్నిత సమాచారాన్ని ఏఐ చాట్‌బాట్లతో పంచుకోవడం ప్రమాదకరమని నిపుణులు చెబుతున్నారు. ఈ సమాచారం దుర్వినియోగం కావడం ద్వారా సైబర్ నేరాలు, ఆర్థిక మోసాలు, వ్యక్తిగత గోప్యత ఉల్లంఘన వంటి సమస్యలు తలెత్తే అవకాశం ఉంది.పేరు, చిరునామా, ఫోన్ నంబర్, కుటుంబ సభ్యుల వివరాలు వంటి వ్యక్తిగత సమాచారం షేర్ చేస్తే సైబర్ నేరగాళ్లు వాటిని ఉపయోగించి మోసాలకు పాల్పడే ప్రమాదం ఉంది. అలాగే బ్యాంక్ ఖాతా నంబర్లు, క్రెడిట్, డెబిట్ కార్డు వివరాలు, యూజర్ నేమ్, పాస్‌వర్డ్‌లను ఏఐ బాట్లకు వెల్లడించడం అత్యంత ప్రమాదకరమని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ఉద్యోగ సంబంధిత కంపెనీ డేటాను చాట్‌బాట్లలో నమోదు చేయడం వల్ల రహస్య సమాచారం బయటకు వెళ్లే అవకాశముంది. ఈ కారణంగా అనేక సంస్థలు ఉద్యోగులు ఏఐ టూల్స్ వాడకంపై ప్రత్యేక మార్గదర్శకాలు జారీ చేస్తున్నాయి. కొన్నిచోట్ల సున్నితమైన ప్రాజెక్ట్ డేటాను ఏఐ ప్లాట్‌ఫామ్‌లలో ఉపయోగించడాన్ని పూర్తిగా నిషేధించారు.ఆరోగ్య సంబంధిత సమస్యలకు చాలామంది ఏఐ చాట్‌బాట్లను ఆశ్రయిస్తున్నప్పటికీ, అవి వైద్యులకు ప్రత్యామ్నాయం కావని నిపుణులు సూచిస్తున్నారు. నిర్ధారణ అయిన వ్యాధులు, మందులు, పరీక్షల వివరాలు వంటి సమాచారాన్ని షేర్ చేయడం గోప్యతకు ముప్పుగా మారవచ్చు. అలాగే న్యాయ సలహాల విషయంలోనూ ఏఐపై పూర్తిగా ఆధారపడకూడదని సూచిస్తున్నారు.
సృజనాత్మక రచనలు, కథలు, కవితలు, పరిశోధన పత్రాలు వంటి విషయాలను కూడా జాగ్రత్తగా పంచుకోవాలని నిపుణులు చెబుతున్నారు. మీరు అందించే సమాచారం భవిష్యత్తులో ఏఐ శిక్షణ కోసం ఉపయోగించే అవకాశం ఉండటంతో కాపీరైట్ సమస్యలు తలెత్తే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు.అలాగే పాస్‌పోర్టులు, ఆధార్, డ్రైవింగ్ లైసెన్సులు, వ్యక్తిగత ఫొటోలు, సున్నితమైన చిత్రాలను చాట్‌బాట్లతో పంచుకోవడం కూడా ప్రమాదకరమే. ఒకసారి ఆన్‌లైన్‌లోకి వెళ్లిన సమాచారం పూర్తిగా తొలగించబడుతుందనే హామీ ఉండదని సైబర్ నిపుణులు చెబుతున్నారు.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews Crime News EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews Wellness WorldNews



















