భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయంలో జరిగే శ్రీరామనవమి మహోత్సవం ప్రపంచవ్యాప్తంగా ఆదర్శంగా నిలుస్తోందని అధికారులు, భక్తులు పేర్కొంటున్నారు. ఈ ఆలయంలో నిర్వహించే పూజా ముహూర్తాలను దేశవ్యాప్తంగా అనుసరిస్తుండటం దక్షిణ అయోధ్యగా భద్రాచలానికి ఉన్న విశిష్టతను తెలియజేస్తోంది. ప్రతి రోజు వేలాది మంది భక్తులు ఆలయాన్ని దర్శించుకుంటూ ఆధ్యాత్మిక అనుభూతిని పొందుతున్నారు.
ఈ నేపథ్యంలో ఆలయ అభివృద్ధికి ప్రభుత్వం రూ.586 కోట్లతో బృహత్తర ప్రణాళికను రూపొందించింది. ఈ ఏడాది మార్చి 27న శ్రీరామనవమి సందర్భంగా సీఎం రేవంత్‌రెడ్డి సహచర మంత్రులతో కలిసి అభివృద్ధి పనులకు భూమిపూజ చేశారు. ఈ పనులను మూడు విడతల్లో 2029 నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.
2027 జూన్ 26 నుంచి జులై 7 వరకు జరగనున్న గోదావరి పుష్కరాలను దృష్టిలో ఉంచుకుని తొలి దశ పనులను వచ్చే ఏడాది ఏప్రిల్‌లో జరిగే శ్రీరామనవమి నాటికి పూర్తి చేయాలని నిర్ణయించారు.
భద్రాచలానికి శతాబ్దాల చరిత్ర ఉంది. ఖమ్మం జిల్లా నేలకొండపల్లి గ్రామానికి చెందిన కంచెర్ల గోపన్న తానీషా కాలంలో తహసీల్దార్‌గా పనిచేస్తూ 1670లో భద్రాచలం వచ్చి భక్త రామదాసుగా మారారు. 1674లో ఆయన ఆలయ నిర్మాణం చేపట్టారు. అనంతరం కాలక్రమంలో రెండు మూడు దఫాలుగా ఆలయం అభివృద్ధి చెందింది. 1966లో చిత్రకూట మండపం, కల్యాణ మండపం, గోపురం వంటి నిర్మాణాలతో ఆలయాన్ని పునరుద్ధరించారు.
భక్త రామదాసు అనంతరం జరుగుతున్న అభివృద్ధి పనులు ఇప్పటివరకు అతిపెద్ద విస్తరణగా భావిస్తున్నారు. మూడో విడతలో రూ.127 కోట్లను పట్టణాభివృద్ధికి, రెండో విడతలో రూ.108 కోట్లను ఆలయం వెలుపల వసతి సదుపాయాలకు కేటాయించారు. మొదటి విడతలో రూ.351 కోట్లతో ఆలయ ప్రాంగణంలో శిల్పకళా నిర్మాణాలు, నూతన ప్రాకారాలు, మండపాలు, గోపురాలు, వంటశాల, కార్యాలయం వంటి పనులు చేపట్టనున్నారు.
ఈ అభివృద్ధి పనుల పూర్తితో భక్తులు రామాలయం నుంచి గోదావరి నది వరకు, రంగనాయకులగుట్ట వరకు సులభంగా చేరుకునే అవకాశం కలుగుతుంది. గోదావరి పుష్కరాల సమయంలో కోటి మంది భక్తులు వచ్చినా ఇబ్బంది లేకుండా సదుపాయాలు ఏర్పాటు చేయనున్నారు.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsToday NewsUpdate PoliticalNews PublicSafety shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews WorldNews



















