రేబిస్ పేరు వినగానే ముందుగా గుర్తొచ్చేది కుక్కకాటు. వైరస్ సోకిన జంతువు కాటు, గీత లేదా లాలాజలం ద్వారా మనుషులకు ఈ వ్యాధి సంక్రమించే అవకాశం ఉంటుంది. లక్షణాలు కనిపించిన తర్వాత రేబిస్ అత్యంత ప్రాణాంతకంగా మారుతుంది. అయితే వ్యాధి రాకుండా ముందస్తు జాగ్రత్తలు, జంతువులకు వ్యాక్సినేషన్, కాటు తర్వాత సకాలంలో వైద్యం వంటి చర్యలతో దీనిని నివారించవచ్చు.
రేబిస్ నియంత్రణ కోసం భూటాన్ 2009 నుంచి దీర్ఘకాలిక కార్యక్రమాన్ని చేపట్టింది. దేశవ్యాప్తంగా కుక్కలకు పెద్దఎత్తున వ్యాక్సినేషన్ నిర్వహించింది. పెంపుడు కుక్కలతో పాటు వీధి కుక్కలపైనా దృష్టి పెట్టింది. కుక్కల సంఖ్య నియంత్రణ కోసం స్టెరిలైజేషన్ కార్యక్రమాలను కూడా చేపట్టింది.
వ్యాక్సినేషన్ చేసిన కుక్కలను గుర్తించేందుకు ప్రత్యేక గుర్తులు, రికార్డులు ఉపయోగించారు. గ్రామీణ ప్రాంతాల్లోనూ వైద్య, ఆరోగ్య బృందాలు పర్యటించి కార్యక్రమాన్ని అమలు చేశాయి.
ఎక్కడైనా కుక్కకాటు ఘటన నమోదైతే అక్కడి పరిస్థితులను అధికారులు పరిశీలించారు. అనుమానాస్పద జంతువులను పరీక్షించడంతో పాటు వైరస్ వ్యాప్తి అవకాశాలను గుర్తించే చర్యలు చేపట్టారు. ప్రజలకు రేబిస్ లక్షణాలు, కుక్కకాటు తర్వాత తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించారు.
భూటాన్ కార్యక్రమంలో ‘వన్ హెల్త్’ విధానం కీలకంగా నిలిచింది. మనుషులు, జంతువులు, పర్యావరణ ఆరోగ్యాన్ని విడివిడిగా కాకుండా సమగ్రంగా చూడటం దీని ప్రధాన ఉద్దేశం. వివిధ ప్రభుత్వ విభాగాలు, ఆరోగ్య సిబ్బంది, వాలంటీర్లు, స్వచ్ఛంద సంస్థలు కలిసి పనిచేశాయి.
భూటాన్ భౌగోళిక పరిస్థితులు ఈ కార్యక్రమానికి పెద్ద సవాలుగా నిలిచాయి. పర్వత ప్రాంతాలు, మారుమూల గ్రామాలకు చేరుకోవడం అంత సులభం కాదు. అయినప్పటికీ హెల్త్ వర్కర్లు, వాలంటీర్లు ఇంటింటికీ వెళ్లి కుక్కల వ్యాక్సినేషన్, స్టెరిలైజేషన్, అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు.
2023 జూన్‌లో చివరి రేబిస్ మరణం నమోదైన తర్వాత కూడా వ్యాధి మళ్లీ వ్యాప్తి చెందకుండా భూటాన్ పర్యవేక్షణ కొనసాగించింది. అనంతరం ప్రపంచ ఆరోగ్య సంస్థ పరిశీలనల అనంతరం దేశానికి రేబిస్ నిర్మూలన గుర్తింపు లభించింది.
రేబిస్ నిర్మూలనకు కేవలం కుక్కలకు వ్యాక్సిన్ వేయడం మాత్రమే కాకుండా.. జంతువుల జనాభా నియంత్రణ, కాటు ఘటనలపై తక్షణ స్పందన, ప్రయోగశాల పరీక్షలు, ప్రజల్లో అవగాహన, ప్రభుత్వ విభాగాల సమన్వయం అవసరమని భూటాన్ అనుభవం చెబుతోంది.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews Crime News EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews Wellness WorldNews


















