భువనగిరిలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల నిర్వహణకు ఏర్పాట్లు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ఈ నెల 15న భువనగిరి ప్రభుత్వ జూనియర్ కళాశాల ఆవరణలో నిర్వహించనున్న వేడుకల ఏర్పాట్లను స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ఏ. భాస్కరరావు శుక్రవారం పరిశీలించారు.
వేడుకల కోసం ఏర్పాటు చేస్తున్న వేదిక, పరేడ్ మైదానం, స్టాళ్లు తదితర ప్రాంతాలను ఆయన పరిశీలించారు. ప్రస్తుతం మున్సిపల్ సిబ్బంది మైదానాన్ని చదును చేస్తున్న పనుల పురోగతిని పరిశీలించి, సిబ్బందికి పలు సూచనలు చేశారు.
స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు హాజరయ్యే ప్రజలు, అధికారులు, విద్యార్థులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లను ముందుగానే పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. తాగునీరు, పారిశుద్ధ్యం, రాకపోకలు, భద్రత తదితర అంశాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు.
మరోవైపు పోలీసులు ముందస్తు కవాతు నిర్వహిస్తూ వేడుకలకు సంబంధించిన ఏర్పాట్లను సమన్వయం చేస్తున్నారు. భువనగిరి ప్రభుత్వ జూనియర్ కళాశాల ఆవరణలో ప్రతి ఏటా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు నిర్వహించడం ఆనవాయితీగా కొనసాగుతోంది.ఈ పరిశీలన కార్యక్రమంలో భువనగిరి తహసీల్దార్ జగన్మోహన్ ప్రసాద్ తదితర అధికారులు పాల్గొన్నారు.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsToday NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews WorldNews



















