భారత సీనియర్ పేసర్ భువనేశ్వర్ కుమార్ మరోసారి టీమిండియాలోకి పునరాగమనంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. 2027 వన్డే ప్రపంచకప్ నేపథ్యంలో అతడిని భారత జట్టులోకి తీసుకోవాలనే చర్చ జరుగుతున్న వేళ.. జాతీయ జట్టు నుంచి పిలుపు వస్తే భారత్ తరఫున ఆడేందుకు తాను ఎప్పుడూ సిద్ధంగా ఉంటానని భువీ స్పష్టం చేశాడు.
ఐపీఎల్ 2026లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరఫున భువనేశ్వర్ అద్భుతంగా రాణించాడు. 28 వికెట్లు పడగొట్టి, ఆ జట్టు వరుసగా రెండోసారి టైటిల్ సాధించడంలో కీలక పాత్ర పోషించాడు. ప్రస్తుతం భారత పేసింగ్ విభాగాన్ని గాయాల సమస్య వేధిస్తున్న నేపథ్యంలో భువీని తిరిగి జాతీయ జట్టులోకి తీసుకోవాలనే డిమాండ్లు వినిపిస్తున్నాయి.
ఆగస్టు 14 నుంచి ప్రారంభం కానున్న యూపీ టీ20 లీగ్‌లో లఖ్‌నవూ ఫాల్కన్స్‌కు భువనేశ్వర్ కుమార్ నాయకత్వం వహిస్తున్నాడు. ఈ లీగ్‌కు ముందు 2027 ప్రపంచకప్‌లో ఆడే అవకాశంపై అతడు స్పందించాడు.
జాతీయ జట్టు నుంచి పిలుపు వస్తే ఎందుకు వద్దంటానని భువీ పేర్కొన్నాడు. భారత్ తరఫున ప్రాతినిధ్యం వహించేందుకు తాను ఎప్పుడూ సిద్ధంగానే ఉంటానని చెప్పాడు. అయితే ప్రస్తుతం తాను ఎంతమేర సిద్ధంగా ఉన్నాననే విషయాన్ని కచ్చితంగా చెప్పలేనని వివరించాడు.
తన దృష్టి ప్రస్తుతం క్రికెట్ ఆడటంపైనే ఉందని, అందుకే యూపీ టీ20 లీగ్‌లో పాల్గొంటున్నానని తెలిపాడు. ఐపీఎల్‌లోనూ వ్యక్తిగత రికార్డుల కోసం కాకుండా జట్టు కోసం పరుగులు, వికెట్లు సాధించి మ్యాచ్‌లు గెలిపించాలనే లక్ష్యంతోనే ఆడినట్లు చెప్పాడు.
జాతీయ జట్టులోకి ఎంపిక కావాలా? వద్దా? అనేది తన చేతుల్లో లేదని, తుది నిర్ణయం సెలెక్టర్లదేనని భువనేశ్వర్ స్పష్టం చేశాడు. దీంతో 2027 ప్రపంచకప్ నాటికి భువీ మళ్లీ భారత జెర్సీలో కనిపిస్తాడా అనే ఆసక్తి అభిమానుల్లో నెలకొంది.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews Crime News EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews Wellness WorldNews



















