15 ఏళ్ల వయసులోనే ఐపీఎల్‌లో వరుసగా రెండో సీజన్‌లో అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకుంటున్న యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ ఇప్పుడు టీమ్‌ఇండియా వైపు మరో కీలక అడుగు వేశాడు. అతడిని సెలక్టర్లు ఇండియా–A జట్టులోకి ఎంపిక చేశారు. ఇది అతడి కెరీర్‌లో పెద్ద మైలురాయిగా భావిస్తున్నారు.
జూన్ 9 నుంచి శ్రీలంకలో ప్రారంభమయ్యే ముక్కోణపు వన్డే సిరీస్‌లో భారత్–A జట్టు బరిలోకి దిగనుంది. ఈ టోర్నీలో ఆతిథ్య శ్రీలంక–Aతో పాటు అఫ్గానిస్థాన్–A జట్లు కూడా పాల్గొననున్నాయి. ఈ జట్టుకు హైదరాబాదీ బ్యాటర్ తిలక్ వర్మ కెప్టెన్‌గా వ్యవహరించనుండగా, రియాన్ పరాగ్ వైస్ కెప్టెన్‌గా ఎంపికయ్యాడు.
ఈ జట్టులో ఎక్కువమంది ఐపీఎల్‌లో మెరుగైన ప్రదర్శన చేసిన యువ ఆటగాళ్లకే చోటు దక్కింది. వైభవ్ సూర్యవంశీ ఎంపిక కూడా అదే క్రమంలో రావడం విశేషం. దంబుల్లాలో జరిగే ఈ వన్డే సిరీస్ తర్వాత భారత్–A జట్టు గాలెలో శ్రీలంక–Aతో రెండు నాలుగు రోజుల మ్యాచ్‌లు ఆడనుంది. ఈ మ్యాచ్‌లకు సంబంధించిన తుది జట్టును తర్వాత ప్రకటించనున్నారు.
ఇండియా–A జట్టు:
తిలక్ వర్మ (కెప్టెన్), రియాన్ పరాగ్ (వైస్ కెప్టెన్), ప్రియాంశ్ ఆర్య, వైభవ్ సూర్యవంశీ, ఆయుష్ బదోని, నిశాంత్ సింధు, హర్ష్ దూబె, సూర్యాంశ్ షెడ్జే, ప్రభ్‌సిమ్రన్ సింగ్ (వికెట్ కీపర్), కుమార్ కుశాగ్ర (వికెట్ కీపర్), విప్రాజ్ నిగమ్, యశ్ ఠాకూర్, యుధ్వీర్ సింగ్, అన్షుల్ కాంబోజ్, అర్షద్ ఖాన్.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsToday NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews WorldNews



















