బహిరంగ ప్రదేశాల్లో చెత్త వేయడం, రోడ్లపై ఉమ్మివేయడం వంటి చర్యలపై బాంబే హైకోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. ముంబయిలోని డంపింగ్ యార్డుల వద్ద కాలుష్యం, విష వాయువులకు సంబంధించిన పిటిషన్ల విచారణ సందర్భంగా ప్రజల ప్రవర్తనపై ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది.
దేశంలో రోడ్లపై, ఖాళీ ప్రదేశాల్లో ఇష్టానుసారం చెత్త వేస్తున్న ప్రజలు.. విదేశాలకు వెళ్లినప్పుడు మాత్రం పరిశుభ్రత పాటిస్తున్నారని కోర్టు వ్యాఖ్యానించింది. ఇక్కడ చిన్న చాక్లెట్ కవర్‌ను కూడా రోడ్డుపై పడేసేందుకు వెనుకాడని వారు.. విదేశాల్లో మాత్రం అదే పని చేయడానికి ఆలోచిస్తారని పేర్కొంది. ‘ఇక్కడ ఉమ్మివేసి.. విదేశాల్లో పరిశుభ్రంగా ఉంటారా?’ అంటూ ప్రశ్నించింది.
పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడం ప్రతి పౌరుడి ప్రాథమిక బాధ్యత అని జస్టిస్ జి.ఎస్. కులకర్ణి, జస్టిస్ ఆర్తి సాఠేలతో కూడిన ధర్మాసనం స్పష్టం చేసింది. పరిశుభ్రమైన వాతావరణాన్ని కోరుకునే హక్కు ఉన్నవారు.. దాన్ని కాపాడే బాధ్యతను కూడా నిర్వర్తించాలని పేర్కొంది.
వీధులు, ఖాళీ ప్రదేశాల్లో చెత్త పేరుకుపోకుండా ప్రజలకు అవగాహన కల్పించడంతో పాటు, మున్సిపల్ అధికారులు కూడా సమర్థవంతమైన చర్యలు తీసుకోవాలని కోర్టు సూచించింది. రోడ్లపై చెత్త వేయడం, ఉమ్మివేయడం వంటి చర్యలకు పాల్పడేవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించింది.
ప్రధాన రహదారులు, వీధుల్లో పేరుకుపోయే చెత్త కారణంగా ప్రజలకు తీవ్రమైన అనారోగ్య సమస్యలు తలెత్తే ప్రమాదం ఉందని కోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. ‘మనం నిజంగా నాగరిక సమాజంలోనే జీవిస్తున్నామా?’ అని ప్రశ్నించింది.
ముంబయిలోని హైకోర్టు భవనం సహా చారిత్రక, వారసత్వ కట్టడాల పరిసరాల్లో చెత్త నిర్వహణ తీరుపైనా ధర్మాసనం అసంతృప్తి వ్యక్తం చేసింది. మున్సిపల్ వాహనాల అస్తవ్యస్త నిర్వహణ కారణంగా స్థానికులతో పాటు విదేశీ పర్యాటకులు కూడా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొంది. ఈ సమస్యలపై వారం రోజుల్లోగా తగిన చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించింది.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsToday NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews WorldNews



















