నీట్ (యూజీ) పరీక్ష రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ భారత రాష్ట్ర సమితి విద్యార్థి విభాగం (భారాసవి) నాయకులు హైదరాబాద్‌లోని గవర్నర్ కార్యాలయం లోక్‌భవన్‌ను ముట్టడించేందుకు యత్నించారు. పోలీసులు అడ్డుకోవడంతో నిరసనకారులు బారికేడ్లు దాటి గేట్లు ఎక్కే ప్రయత్నం చేయడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
పోలీసులు నిరసనకారులను బలవంతంగా పక్కకు తరలించే క్రమంలో తోపులాట చోటుచేసుకుంది. ఈ సందర్భంగా సివిల్ దుస్తుల్లో ఉన్న ఓ పోలీసు అధికారి నిరసనకారులపై లాఠీ ప్రయోగించడం చర్చనీయాంశమైంది. ఈ ఘటనలో పంజాగుట్ట ఏసీపీ మురళీకృష్ణ చేతికి గాయమైనట్లు సమాచారం.భారాసవి రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ నిరసనలో పాల్గొన్న 45 మందిని పోలీసులు అరెస్టు చేసి పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌కు తరలించారు. అనంతరం వారిని సొంత పూచీకత్తుపై విడుదల చేశారు.
ఈ సందర్భంగా గెల్లు శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ నీట్ ప్రశ్నాపత్రం లీకేజీకి కేంద్ర ప్రభుత్వ వైఫల్యమే కారణమని ఆరోపించారు. దేశవ్యాప్తంగా 22 లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తు ప్రమాదంలో పడిందన్నారు. 2021, 2024లో జరిగిన పేపర్ లీకేజీల నుంచి నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ గుణపాఠం నేర్చుకోలేదని విమర్శించారు. లీకేజీకి బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsToday NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews WorldNews



















