Kakinadaలోని ఈవీఎం గోదాములో విధుల్లో ఉన్న హెడ్‌కానిస్టేబుల్ లంకే ధనరాజు తుపాకీ మిస్‌ఫైర్ ఘటనలో గాయపడ్డారు.విధుల్లో ఉండగా తుపాకీ అకస్మాత్తుగా పేలి బుల్లెట్ ఆయన ఛాతీలోకి దూసుకెళ్లింది. తీవ్ర రక్తస్రావం జరగడంతో వెంటనే ఆయనను సమీప ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రాథమిక చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం ప్రైవేటు ఆసుపత్రికి మార్చారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని సమాచారం.
ధనరాజు ప్రస్తుతం వీఆర్‌లో ఉన్న హెడ్‌కానిస్టేబుల్‌గా పనిచేస్తూ ఇటీవలే అల్లూరి జిల్లాకు నుంచి కాకినాడకు బదిలీపై వచ్చారు. మళ్లీ తూర్పుగోదావరి జిల్లాకు బదిలీ ప్రక్రియ కొనసాగుతున్న సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది.ప్రాథమికంగా తుపాకీ శుభ్రం చేస్తుండగా మిస్‌ఫైర్ జరిగిందని పోలీసులు చెబుతుండగా, మరోవైపు కొన్ని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే ఆయనపై కాల్పుల ఆరోపణలను పోలీసులు ఖండించారు.ఈ ఘటనపై Kakinada III Town Police Station కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించింది.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews Wellness WorldNews


















