క్యాండిడేట్స్ చెస్ టోర్నమెంట్‌లో భారత స్టార్ Vaishali Rameshbabu కీలక దశకు చేరుకుంది. మహిళల విభాగంలో 11వ రౌండ్ వరకు ఆధిక్యంలో కొనసాగిన ఆమె, తర్వాతి రౌండ్‌లో జు జినెర్ చేతిలో ఓటమి చవిచూసింది. దీంతో ప్రస్తుతం ఆమె 7 పాయింట్లతో జు జినెర్‌తో కలిసి సంయుక్త అగ్రస్థానంలో కొనసాగుతోంది.ఇక టైటిల్ రేస్ మరింత ఉత్కంఠభరితంగా మారింది. వైశాలి టైటిల్ ఆశలు కొనసాగాలంటే 13వ రౌండ్‌లో చైనాకు చెందిన మాజీ ప్రపంచ ఛాంపియన్ జాంగ్ యీ టాన్‌పై తప్పక మంచి ఫలితం సాధించాల్సి ఉంది. ఈ కీలక మ్యాచ్‌లో ఒత్తిడిని తట్టుకుని ఆమె ఎలా ఆడుతుందనేది ఆసక్తికరంగా మారింది.
మరోవైపు ప్రపంచకప్ విజేత Divya Deshmukh (5 పాయింట్లు) కూడా తన తర్వాతి మ్యాచ్‌లో రష్యాకు చెందిన కేథరినా లాగ్నోతో తలపడనుంది. టైటిల్ రేస్ నుంచి వెనుకబడినప్పటికీ ఆమె ప్రదర్శనపై ఆసక్తి కొనసాగుతోంది.ఓపెన్ విభాగంలో భారత గ్రాండ్‌మాస్టర్ R Praggnanandhaa (5 పాయింట్లు) అమెరికా స్టార్ హికరు నకమురాతో తలపడనున్నాడు.ఇప్పటికే 9 పాయింట్లతో అగ్రస్థానంలో ఉన్న ఉజ్బెకిస్థాన్‌కు చెందిన సిందరోవ్ టైటిల్ వైపు దూసుకెళ్తున్నాడు.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews Wellness WorldNews


















