జల్ జీవన్ మిషన్ 2.0 కార్యక్రమం ద్వారా దేశవ్యాప్తంగా ప్రతి ఇంటికి సురక్షితమైన తాగునీటిని అందించాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ముందుకు సాగుతోందని కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సీఆర్ పాటిల్ తెలిపారు. ఏపీ ప్రభుత్వంతో ఎంఓయూ అనంతరం ఢిల్లీ నుంచి వర్చువల్‌గా మాట్లాడిన ఆయన, వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన విజ్ఞప్తుల మేరకు ఈ మిషన్‌ను పొడిగించినట్లు చెప్పారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రధాని నరేంద్ర మోదీతో ఈ అంశంపై చర్చించి మిషన్ పొడిగింపుకు కీలక పాత్ర పోషించారని మంత్రి పేర్కొన్నారు. ఈ ప్రతిపాదనకు ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు. జల్ జీవన్ మిషన్ తొలి దశలో దేశవ్యాప్తంగా 16 కోట్ల గృహాలకు పైపుల ద్వారా నీటి కనెక్షన్లు అందించినట్లు వెల్లడించారు. ఇంకా 3 కోట్ల ఇళ్లకు తాగునీరు అందించాల్సి ఉందని తెలిపారు. ప్రాజెక్టులో ఉన్న లోపాలను సవరించి, నిర్వహణ వ్యవస్థను మరింత బలోపేతం చేస్తున్నామని చెప్పారు.
ఏపీలో నీటి నాణ్యత పరీక్షల్లో డ్వాక్రా మహిళల సేవలను వినియోగించుకోవాలని సూచించారు. ఈ పథకం ద్వారా దేశవ్యాప్తంగా కోట్లాది మహిళలు నీటి కోసం పడే కష్టాలు తగ్గుతాయని పేర్కొన్నారు. జేజేఎం 2.0 ద్వారా ఏపీలో ప్రతి ఇంటికి కుళాయి కనెక్షన్ లక్ష్యం త్వరలోనే సాధ్యమవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. 2047 నాటికి వికసిత్ భారత్ లక్ష్యం చేరుకోవాలంటే ప్రతి ఇంటికి సురక్షిత తాగునీరు అందడం కీలకమని స్పష్టం చేశారు. రైతులకు సాగునీరు సరఫరా కూడా సమర్థవంతంగా జరిగేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. త్వరలోనే ఏపీ జిల్లాల కలెక్టర్లతో వర్చువల్ సమావేశం నిర్వహించి ప్రాజెక్టు అమలుపై దిశానిర్దేశం చేయనున్నట్లు వెల్లడించారు.
Andhra pradesh Andhrapradesh AndhraPradeshNews APDevelopment APGovernment APNews APPolitics Breaking news BreakingNews Business BusinessNews ChandrababuNaidu CricketFans CricketNews CrimeNews Entertainment Geopolitics Government India IndiaNews LawAndOrder Movies Naralokesh News news24 newsalert NewsToday NewsUpdate NewsUpdates PoliticalNews PublicSafety shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates SportsNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews WorldNews



















