హైదరాబాద్ / హార్వర్డ్ – తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అమెరికాలోని ప్రఖ్యాత హార్వర్డ్ యూనివర్సిటీ – కెన్నెడీ స్కూల్ ఆఫ్ గవర్నమెంట్లో లీడర్‌షిప్ కోర్సును విజయవంతంగా పూర్తి చేశారు. ఈ కోర్సు పూర్తిచేసిన అనంతరం హార్వర్డ్ కెన్నెడీ స్కూల్ నుంచి సర్టిఫికెట్ కూడా అందుకున్నారు.
ఈ నెల 25 నుంచి 30 వరకు ‘Leadership for the 21st Century’ పేరిట నిర్వహించిన తరగతులకు సీఎం రేవంత్ రెడ్డి హాజరయ్యారు. ప్రపంచవ్యాప్తంగా 20 దేశాల నుంచి వచ్చిన 60 మంది ప్రతినిధులతో కలిసి ఈ కోర్సులో పాల్గొన్నట్లు ఆయన తెలిపారు.

ఈ సందర్భంగా టీచర్లు, తోటి విద్యార్థులతో జరిగిన చర్చల ద్వారా ఎంతో నేర్చుకున్నానని సీఎం పేర్కొన్నారు. ఈ విషయాన్ని ఆయన తన ఎక్స్ (Twitter) ఖాతా ద్వారా పంచుకున్నారు. భవిష్యత్ పాలనలో ఈ అనుభవం ఉపయోగపడుతుందని ఆయన అభిప్రాయపడ్డారు.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsToday NewsUpdate PoliticalNews PublicSafety shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews WorldNews

















