జనగామలో విషాద ఘటన చోటుచేసుకుంది. నీటి సంపులో పడి 2 ఏళ్ల చిన్నారి ప్రియాన్షి మృతి చెందగా, ఆ వార్తను తట్టుకోలేక నాయనమ్మ గుండెపోటుతో అక్కడికక్కడే మరణించింది. ఒకే రోజు ఒకే కుటుంబంలో రెండు మరణాలు సంభవించడంతో ఆ కుటుంబం తీవ్ర విషాదంలో మునిగిపోయింది.
పట్టణ ఎస్సై రతీష్ తెలిపిన వివరాల ప్రకారం, జనగామ అంబేడ్కర్‌నగర్‌కు చెందిన గూడెల్లి రఘువంశి–పావని దంపతులకు కుమార్తె ప్రియాన్షి (2) ఉంది. బుధవారం ఉదయం ఇంటి ఆవరణలో ఆడుకుంటూ ఉండగా చిన్నారి అనుకోకుండా నీటి సంపులో పడిపోయింది.
పాప కనిపించకపోవడంతో తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు ఆందోళనతో వెతకగా నీటి సంపులో అచేతన స్థితిలో కనిపించింది. వెంటనే బయటకు తీసి స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా, వైద్యులు ఆమె అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు.
మృతదేహాన్ని ఇంటికి తీసుకురాగా బంధువులు, గ్రామస్థులు శోకసంద్రంలో మునిగిపోయారు. ఈ సమయంలో చిన్నారి మరణాన్ని తట్టుకోలేక నాయనమ్మ నాగమ్మ (65) తీవ్ర ఆవేదనకు గురై గుండెపోటుతో అక్కడికక్కడే కుప్పకూలిపోయింది.
ఈ ఘటనతో రఘువంశి కుటుంబం ఒక్కసారిగా రెండు ప్రాణాలు కోల్పోయి తీవ్ర విషాదంలో మునిగిపోయింది. గ్రామంలో శోకచాయలు అలుముకున్నాయి.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsToday NewsUpdate PoliticalNews PublicSafety shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews WorldNews



















