‘పెద్ది’ సినిమా కోసం రామ్‌చరణ్ ఎంతో కష్టపడ్డారని దర్శకుడు బుచ్చిబాబు తెలిపారు. ఆయన దర్శకత్వంలో రామ్‌చరణ్ హీరోగా తెరకెక్కుతున్న ఈ చిత్రం ‘పెద్ది’ (Peddi) ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. ఈ సినిమా జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో దర్శకుడు బుచ్చిబాబు చిత్రానికి సంబంధించిన పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.
రామ్‌చరణ్‌కు కథ చెప్పగానే వెంటనే ఓకే చెప్పారని ఆయన తెలిపారు. ఆ తర్వాత ఒకసారి తన ఇంటికి వెళ్లినప్పుడు మెగాస్టార్ చిరంజీవి కూడా కథ వినాలని అడిగారని చెప్పారు. చిరంజీవికి కథ చెప్పడం తనకు గొప్ప అనుభవంగా అనిపించిందని, ఆయన ఎంతో ఆసక్తిగా వింటారని, పాత్రల్లో పూర్తిగా లీనమవుతారని బుచ్చిబాబు పేర్కొన్నారు. ‘పెద్ది’ సెట్స్‌కు కూడా చిరంజీవి వచ్చారని ఆయన వెల్లడించారు.
చిరంజీవి వచ్చిన సమయంలో కుస్తీ పోటీ సన్నివేశం షూటింగ్ జరుగుతోందని, ఎండలో రామ్‌చరణ్ తీవ్రంగా కష్టపడుతున్న దృశ్యాన్ని చూసి ఆయన ఎక్కువసేపు అక్కడ ఉండలేకపోయారని చెప్పారు. దాదాపు గంటన్నర మాత్రమే సెట్స్‌లో ఉన్నారని తెలిపారు. ఆ సమయంలో “తండ్రి ఎంత కష్టమైనా భరిస్తాడు కానీ, కొడుకు కష్టాన్ని మాత్రం చూడలేడు కదా” అనే భావన తనకు కలిగిందని బుచ్చిబాబు అన్నారు. అలాగే “మనం ఎంత కష్టపడితే దానికి తగిన ఫలితం వస్తుంది” అని చిరంజీవి ప్రోత్సహించారని వెల్లడించారు.
ఇక ‘పెద్ది’లో సంగీతం కూడా ప్రధాన ఆకర్షణగా నిలుస్తుందని దర్శకుడు చెప్పారు. ఏఆర్ రెహమాన్‌తో పని చేయడం తనకు గొప్ప అనుభూతి అని ఆయన తెలిపారు. రెహమాన్ ఎవరికీ తన వ్యక్తిగత నంబర్ ఇవ్వరని, కానీ తాను కథ చెప్పిన మొదటి సారే తనకు నంబర్ ఇచ్చారని వెల్లడించారు. అప్పటి నుంచి ఆయన ఎప్పుడైనా అందుబాటులో ఉంటారని చెప్పారు. సినిమాలోని స్పెషల్ సాంగ్ చాలా బాగా వచ్చిందని, ఆడియో పెద్ద హిట్ అవుతుందని నమ్మకం వ్యక్తం చేశారు.
రెహమాన్ ఎంతో పాజిటివ్ వ్యక్తి అని, ఎన్నిసార్లు ట్యూన్స్ రిజెక్ట్ చేసినా మళ్లీ కొత్తగా ప్రయత్నిస్తారని బుచ్చిబాబు చెప్పారు. ‘చికిరి’ పాటకు ఆయన తనను పక్కన కూర్చోబెట్టి ట్యూన్ రూపొందించారని గుర్తు చేశారు. అలాగే హీరోయిన్ జాన్వీ కపూర్ కూడా చాలా నిబద్ధతతో పనిచేశారని, షూటింగ్ సమయంలో ఒక్క రోజు కూడా ఇబ్బంది పెట్టలేదని ఆయన తెలిపారు.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews Crime News EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews Wellness WorldNews



















