ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విశాఖపట్నంలో పలు కీలక ప్రకటనలు చేశారు. నగరంలో సైక్లింగ్ మరియు వాకింగ్‌ను ప్రోత్సహించేందుకు ప్రత్యేక ట్రాక్‌లు ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. విశాఖ ఆంధ్ర విశ్వవిద్యాలయం ఇంజినీరింగ్ కళాశాల మైదానంలో నిర్వహించిన కార్యక్రమంలో మొక్కలు నాటి పర్యావరణ పరిరక్షణపై అవగాహన కల్పించారు.
ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ, విశాఖ నగరాన్ని పచ్చదనంతో నింపేందుకు ప్రత్యేక కార్యాచరణ చేపడుతున్నట్లు తెలిపారు. యూనివర్సిటీ క్యాంపస్‌లో విద్యుత్ అవసరాలను పూర్తిగా సోలార్ శక్తి ద్వారా తీర్చుకునేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఖాళీ ప్రదేశాలు, భవనాలపై సోలార్ ప్యానెల్స్ ఏర్పాటు చేసి స్వయం సమృద్ధి సాధించాలని పేర్కొన్నారు.
హాస్టళ్లు, విద్యాసంస్థల నుంచి వచ్చే తడి చెత్తను కంపోస్టుగా మార్చడం, వ్యర్థాలతో బయోగ్యాస్ తయారు చేసి వంట గదుల్లో వినియోగించడం, మిగిలిన చెత్తను వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్లకు పంపించడం వంటి పర్యావరణ హిత చర్యలను అమలు చేయాలని సూచించారు. అలాగే మురుగునీటి శుద్ధి ప్లాంట్లు ఏర్పాటు చేసి శుద్ధి చేసిన నీటిని చెట్ల సంరక్షణకు ఉపయోగించాలని పేర్కొన్నారు.
ఆంధ్ర విశ్వవిద్యాలయాన్ని ప్రపంచంలోని టాప్ 10 లేదా టాప్ 20 నాలెడ్జ్ యూనివర్సిటీల సరసన నిలబెట్టేలా ప్రణాళికలు రూపొందించాలని, విద్యార్థుల ఆలోచనలను కూడా అభివృద్ధి ప్రణాళికల్లో భాగం చేయాలని సీఎం సూచించారు.
నెట్ జీరో కార్యక్రమంలో భాగంగా ఏయూ క్యాంపస్ నుంచి నోవాటెల్ హోటల్ వరకు సుమారు 5.5 కిలోమీటర్ల దూరాన్ని చంద్రబాబు సైకిల్‌పై ప్రయాణించారు. తీవ్ర ఎండను సైతం లెక్కచేయకుండా ప్రజలకు అభివాదం చేస్తూ సైక్లింగ్ చేశారు. ఈ ర్యాలీలో కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, రాష్ట్ర మంత్రులు, ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews Wellness WorldNews



















