రాష్ట్రంలోని 27 లక్షల మంది విద్యార్థులకు తెలంగాణ పబ్లిక్ స్కూల్ (TPS) స్ఫూర్తినిస్తుందని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. రంగారెడ్డి జిల్లా ఆరుట్లలో రూ.15 కోట్ల వ్యయంతో అంతర్జాతీయ ప్రమాణాలతో ఏర్పాటు చేసిన తెలంగాణ పబ్లిక్ స్కూల్‌ను సీఎం ప్రారంభించారు.
ఈ సందర్భంగా సీఎం స్కూల్‌లోని డిజిటల్ క్లాస్‌రూమ్స్, ఆధునిక లైబ్రరీ, సైన్స్ ల్యాబ్స్, అత్యాధునిక కిచెన్, డైనింగ్ హాల్ వంటి సదుపాయాలను స్వయంగా పరిశీలించారు. అనంతరం విద్యార్థులతో కలిసి అల్పాహారం తీసుకుని, వారితో ముచ్చటించారు. అలాగే ఆహ్లాదకరంగా ఏర్పాటు చేసిన మైదానంలో విద్యార్థులతో కలిసి ఫుట్‌బాల్ ఆడి సందడి చేశారు.
సభలో మాట్లాడిన సీఎం రేవంత్‌రెడ్డి, రాష్ట్ర విద్యా రంగాన్ని సమూలంగా మార్చేందుకు ప్రభుత్వం పెద్ద ఎత్తున చర్యలు తీసుకుంటోందని తెలిపారు. రాష్ట్ర బడ్జెట్‌లో దాదాపు రూ.27 వేల కోట్లు విద్యాశాఖకు కేటాయిస్తున్నట్లు చెప్పారు. విద్యా వ్యవస్థను ప్రక్షాళన చేయడానికే విద్యా కమిషన్‌ను ఏర్పాటు చేసినట్లు వివరించారు.
ప్రభుత్వ పాఠశాలలపై ఉన్న అపోహలను తొలగించి, నాణ్యమైన విద్యను అందించడమే తమ లక్ష్యమని సీఎం అన్నారు. “ప్రభుత్వ బడుల్లో చదవడం నామోషీ అనే భావన పోవాలి. ఇక్కడ చదివి ఐఏఎస్, ఐపీఎస్, ఉన్నత స్థాయికి చేరిన వారు ఉన్నారు” అని ఆయన గుర్తుచేశారు.
గత ప్రభుత్వంపై విమర్శలు చేస్తూ, వర్గాల వారీగా స్కూళ్లు ఏర్పాటు చేసి కుల వ్యవస్థను ప్రోత్సహించారని ఆరోపించారు. దీనికి విరుద్ధంగా తమ ప్రభుత్వం ఇంటిగ్రేటెడ్ స్కూళ్లను నిర్మించి సమాన విద్యావకాశాలు కల్పిస్తోందని చెప్పారు.
త్వరలో యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీని ప్రారంభించనున్నట్లు సీఎం వెల్లడించారు. క్రీడల అభివృద్ధికి ప్రాధాన్యం ఇస్తూ, అంతర్జాతీయ క్రీడాకారులను రాష్ట్రానికి తీసుకువచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయని తెలిపారు. గతంలో విద్యా కిట్ల నాణ్యతపై విమర్శలు వచ్చిన నేపథ్యంలో, ఈసారి రూ.680 కోట్లతో నాణ్యమైన కిట్ల కోసం టెండర్లు పిలిచినట్లు చెప్పారు.
విద్యారంగంలో తెలంగాణను దేశానికి ఆదర్శంగా నిలిపేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని సీఎం రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsToday NewsUpdate PoliticalNews PublicSafety shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews WorldNews



















