కోయంబత్తూరులో 2022లో జరిగిన ఆత్మాహుతి దాడి కేసుకు సంబంధించిన మనీలాండరింగ్ ఆరోపణలపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దర్యాప్తును ముమ్మరం చేసింది. ఈ క్రమంలో చెన్నై, కోయంబత్తూరు, ముంబయి, హైదరాబాద్ నగరాల్లో ఈడీ అధికారులు సోదాలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో కేసుకు సంబంధించిన కీలక పత్రాలు, ఇతర ఆధారాలను స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం.
కోయంబత్తూరులోని ఆలయం సమీపంలో 2022 అక్టోబర్‌లో జరిగిన ఆత్మాహుతి పేలుడు ఘటనపై జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) నమోదు చేసిన కేసు ఆధారంగా ఈడీ మనీలాండరింగ్ కోణంలో విచారణ చేపట్టింది. దర్యాప్తులో భాగంగా ఐసిస్ భావజాలంతో ప్రభావితమైన జమేషా ముబీన్ పేలుడుకు పాల్పడినట్లు గుర్తించారు.
ఈ కేసులో మొత్తం 12 మందిని నిందితులుగా గుర్తించినట్లు అధికారులు తెలిపారు. నిందితులు ఉగ్ర కార్యకలాపాలకు నిధులు సమకూర్చుకునేందుకు నకిలీ కొవిడ్ వ్యాక్సిన్ సర్టిఫికెట్ల విక్రయానికి పాల్పడ్డారనే ఆరోపణలపై కూడా దర్యాప్తు సాగుతోంది. 2021 ఆగస్టు నుంచి 2022 జూన్ మధ్య జరిగినట్లు చెబుతున్న ఆర్థిక లావాదేవీలను అధికారులు పరిశీలిస్తున్నారు.
ఈ నిధుల ప్రవాహం, ఆర్థిక లావాదేవీలు, మనీలాండరింగ్‌కు సంబంధించిన ఆధారాలను సేకరించడంలో భాగంగానే తాజా సోదాలు నిర్వహించినట్లు తెలుస్తోంది. సోదాల్లో లభించిన పత్రాలు, డిజిటల్ ఆధారాలు, ఆర్థిక లావాదేవీల వివరాలను అధికారులు విశ్లేషించే అవకాశం ఉంది.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsToday NewsUpdate PoliticalNews PublicSafety shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews WorldNews



















