కర్ణాటక రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. రాష్ట్ర ముఖ్యమంత్రి సిద్ధరామయ్య త్వరలో రాజీనామా చేయనున్నారని, అనంతరం మే 30న కొత్త ముఖ్యమంత్రి ప్రమాణస్వీకారం చేస్తారని కాంగ్రెస్ వర్గాలు పేర్కొంటున్నాయి.
సీఎం పదవిపై సిద్ధరామయ్య, ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్ మధ్య ఎప్పటినుంచో కొనసాగుతున్న పోటీ నేపథ్యంలో కాంగ్రెస్ అధిష్ఠానం సయోధ్యకు ప్రయత్నిస్తోంది. ఎవరి వర్గాన్నీ నొప్పించకుండా అధికార మార్పిడి జరపాలని పార్టీ నేతలు భావిస్తున్నారు.
సిద్ధరామయ్య తొలుత మంత్రులకు అల్పాహార విందు ఇచ్చి, అనంతరం గవర్నర్‌ను కలిసి రాజీనామా పత్రం సమర్పించే అవకాశం ఉన్నట్లు సమాచారం. అదే సమయంలో డీకే శివకుమార్ బెంగళూరుకు చేరుకుని కీలక సమావేశాల్లో పాల్గొననున్నారు. అనంతరం ఇద్దరు నేతలు కలిసి మీడియా ముందుకు వచ్చే అవకాశముంది.
ఇక కొత్త సీఎం రేసులో డీకే శివకుమార్‌తో పాటు హోంమంత్రి జి. పరమేశ్వర పేరు కూడా వినిపిస్తోంది. అహింద వర్గాల ప్రాతినిధ్యాన్ని దృష్టిలో పెట్టుకుని పరమేశ్వరకు అవకాశం ఇవ్వాలనే ప్రతిపాదన సిద్ధరామయ్య నుంచి వచ్చినట్లు తెలుస్తోంది.
2023లో ఇచ్చిన అధికార పంపిణీ హామీ ప్రకారం తనకు ముఖ్యమంత్రి పదవి ఇవ్వాలని డీకే శివకుమార్ పార్టీ అధిష్ఠానాన్ని ఒత్తిడి చేస్తున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో కర్ణాటక రాజకీయాల్లో ఉత్కంఠ మరింత పెరిగింది.
Andhra pradesh Andhrapradesh AndhraPradeshNews APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EntertainmentNews Geopolitics Government India IndiaNews InternationalNews LatestNews LawAndOrder MarketUpdate News news24 newsalert NewsToday NewsUpdate PoliticalNews PublicSafety shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews WorldNews



















