పాత భవనాన్ని కూల్చిన తర్వాత అందులోని కాంక్రీట్, ఇసుక, కంకర, ఇనుమును వ్యర్థాలుగా భావించి పడేయాల్సిన అవసరం లేదని చెన్నైలోని సీఎస్‌ఐఆర్–స్ట్రక్చరల్ ఇంజినీరింగ్ రీసెర్చ్ సెంటర్ (ఎస్‌ఈఆర్‌సీ) నిరూపించింది. కూల్చివేతల నుంచి లభించే నిర్మాణ వ్యర్థాలను రీసైక్లింగ్ చేసి కొత్త భవన నిర్మాణంలో వినియోగించే సాంకేతికతను అభివృద్ధి చేసింది.
‘వ్యర్థాల నుంచి సంపద’ ప్రాజెక్టులో భాగంగా సుమారు 1,953 చదరపు అడుగుల విస్తీర్ణంలో గ్రౌండ్ ఫ్లోర్‌తో పాటు మొదటి అంతస్తుతో కూడిన భవనాన్ని నిర్మించారు. ఇందులో 100 శాతం రీసైకిల్ ఇసుక, 50 శాతం రీసైకిల్ కంకరతో పాటు స్లాగ్ సిమెంట్‌ను ఉపయోగించారు.
భవనం బయటి నిర్మాణంలో కాంక్రీట్, ఇటుకలను, అంతర్గత గోడలకు హాలోబ్లాక్‌లను వినియోగించారు. స్లాబ్ నిర్మాణంలోనూ రీసైకిల్ చేసిన ఇనుమును ఉపయోగించారు. ఈ విధానంతో సంప్రదాయ నిర్మాణంతో పోలిస్తే సుమారు 55 శాతం వరకు ఖర్చు తగ్గినట్లు అధికారులు తెలిపారు.
చెన్నై మహానగరపాలక సంస్థ సేకరించే నిర్మాణ వ్యర్థాల నుంచి అవసరమైన పదార్థాలను పొందుతున్నట్లు సీఎస్‌ఐఆర్–ఎస్‌ఈఆర్‌సీ వెల్లడించింది. ఈ సాంకేతికత ద్వారా నిర్మాణ వ్యర్థాల నిర్వహణకు పరిష్కారం లభించడంతో పాటు నిర్మాణ వ్యయం, పర్యావరణంపై ప్రభావం కూడా తగ్గే అవకాశం ఉందని పేర్కొంది.
రీసైకిల్ పదార్థాలతో నిర్మించిన భవనం దృఢత్వం, నిర్మాణ నాణ్యత పరంగా ప్రమాణాలకు అనుగుణంగా ఉన్నట్లు ధ్రువీకరించినట్లు సీఎస్‌ఐఆర్ డైరెక్టర్ ఆనందవల్లి తెలిపారు. భవిష్యత్‌లో భవనాల కూల్చివేతల నుంచి వచ్చే వ్యర్థాలను తిరిగి నిర్మాణ రంగంలో వినియోగించేందుకు ఈ విధానం ఉపయోగపడే అవకాశం ఉంది.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews Wellness WorldNews



















