ఉమ్మడి పీజీ ప్రవేశ పరీక్ష సీపీగెట్-2026కు దరఖాస్తుల స్వీకరణ ఈ నెల 15 నుంచి ప్రారంభం కానుంది. రాష్ట్రంలోని 7 సంప్రదాయ విశ్వవిద్యాలయాలతో పాటు జేఎన్‌టీయూహెచ్, కొత్తగూడెం ఎర్త్ సైన్సెస్ యూనివర్సిటీల్లో పీజీ సైన్స్ కోర్సుల్లో ప్రవేశాల కోసం ఈ పరీక్ష నిర్వహించనున్నారు.
సీపీగెట్ షెడ్యూల్‌ను రాష్ట్ర ఉన్నత విద్యామండలి ఛైర్మన్ ఆచార్య వి. బాలకిష్టారెడ్డి, వివిధ విశ్వవిద్యాలయాల వీసీలు, కన్వీనర్ విడుదల చేశారు. కాకతీయ విశ్వవిద్యాలయం తొలిసారిగా సీపీగెట్ నిర్వహిస్తోందని వీసీ ఆచార్య ప్రతాప్‌రెడ్డి తెలిపారు.
ఈసారి ఇంటర్ అర్హతతో ప్రవేశాలు పొందే ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్ కోర్సులకు సీపీగెట్ వర్తించదని, వాటి అడ్మిషన్లు దోస్త్ ద్వారా నిర్వహిస్తామని అధికారులు వెల్లడించారు. మొత్తం 45 సబ్జెక్టులకు పరీక్షలు నిర్వహించనున్నట్లు కన్వీనర్ ఆచార్య రాజేందర్ తెలిపారు.
అభ్యర్థులు జూన్ 10 వరకు ఆలస్య రుసుం లేకుండా దరఖాస్తు చేసుకోవచ్చు. రూ.2 వేల ఆలస్య రుసుంతో జూన్ 18 వరకు అవకాశం ఉంటుంది. జులై తొలి వారంలో ఆన్‌లైన్ పరీక్షలు నిర్వహించి, ఆగస్టు మొదటి వారంలో తరగతులు ప్రారంభించనున్నారు.అలాగే విశ్వవిద్యాలయాల్లో ఖాళీగా ఉన్న ఆచార్యుల పోస్టుల భర్తీపై ప్రభుత్వం త్వరగా స్పష్టత ఇవ్వాలని వీసీలు కోరారు. పరిశోధనల పురోగతికి తగిన బోధనా సిబ్బంది అవసరమని పేర్కొన్నారు.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsToday NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews WorldNews



















