సాహసం, పట్టుదల ఉంటే ఎంతటి సవాలునైనా అధిగమించవచ్చని సైబరాబాద్ స్పెషల్ బ్రాంచ్ ఇన్‌స్పెక్టర్ ఎం.మహేశ్ నిరూపించారు. మోటార్‌సైకిల్‌పై ప్రపంచంలోని అత్యంత ఎత్తయిన పర్వత రహదారుల్లో ఒకటైన ఉమ్లింగ్ లా పాస్‌ను అధిరోహించి అరుదైన ఘనత సాధించారు. సముద్ర మట్టానికి 19,024 అడుగుల ఎత్తులో ఉన్న ఉమ్లింగ్ లాకు చేరుకోవడం ఆయన సాహస యాత్రలో కీలక ఘట్టంగా నిలిచింది.
హిమాచల్‌ప్రదేశ్‌లోని మనాలి నుంచి ప్రారంభమైన మహేశ్ ప్రయాణం ఏడు రోజుల పాటు సాగింది. ఈ క్రమంలో నిర్జనమైన పర్వత రహదారులు, ఎత్తైన కొండలు, నదులు, లోయలను దాటుకుంటూ ఆయన ముందుకు సాగారు. ప్రకృతి సౌందర్యంతో పాటు ప్రతికూల వాతావరణం కూడా ఈ ప్రయాణంలో తీవ్ర సవాళ్లు విసిరింది.
మనాలి నుంచి లడఖ్ ప్రాంతానికి చేరుకున్న మహేశ్ పాంగ్యాంగ్ త్సోను సందర్శించారు. అనంతరం ఛాంగ్‌థాంగ్ ప్రాంతంలోని 1962 ఇండో-చైనా యుద్ధానికి సంబంధించిన రెజాంగ్ లా యుద్ధస్మారకాన్ని సందర్శించారు. దేశ రక్షణ కోసం ప్రాణత్యాగం చేసిన సైనికులకు నివాళులర్పించారు.
ఈ సాహస యాత్రలో గడ్డకట్టించే చలి, శీతల గాలులు, ప్రతికూల వాతావరణ పరిస్థితులు మహేశ్‌కు పరీక్షగా నిలిచాయి. ఎత్తైన ప్రాంతాల్లో ఆక్సిజన్ కొరతతో పాటు ప్రమాదకరమైన మలుపులు, కఠినమైన రహదారులు ఎదురైనా ఆయన వెనక్కి తగ్గలేదు. శారీరకంగా, మానసికంగా ఎదురైన సవాళ్లను అధిగమిస్తూ తన లక్ష్యాన్ని చేరుకున్నారు.
ఉమ్లింగ్ లా పాస్‌ను మోటార్‌సైకిల్‌పై అధిరోహించడం తనకు ఎంతో సంతృప్తినిచ్చిందని మహేశ్ తెలిపారు. పట్టుదలతో ముందుకు సాగితే కఠినమైన లక్ష్యాలను సైతం సాధించవచ్చని ఈ యాత్ర తనకు మరింత నమ్మకాన్ని ఇచ్చిందని పేర్కొన్నారు.
మహేశ్ సాహస యాత్రను సైబరాబాద్ పోలీస్ కమిషనర్ రమేశ్ అభినందించారు. విధి నిర్వహణతో పాటు సాహస క్రీడలపై ఆసక్తి చూపుతూ అరుదైన ఘనత సాధించడం అభినందనీయమని ప్రశంసించారు.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsToday NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews WorldNews


















