19 ఏళ్ల మహిళకు ప్రసవ సమయంలో జరిగిన ఆపరేషన్ తీవ్ర విషాదంగా మారింది. మహారాష్ట్రలోని బీడ్ జిల్లాలో వైద్యుల నిర్లక్ష్యానికి సంబంధించిన ఈ ఘటన కలకలం రేపుతోంది. వడ్వాణి గ్రామానికి చెందిన సంధ్య ఆగస్టు 1న ప్రసవం కోసం బీడ్ జిల్లా ఆస్పత్రిలో చేరారు. అదే రోజు సాయంత్రం ఆమెకు శస్త్రచికిత్స నిర్వహించారు. అనంతరం నాలుగు రోజుల తర్వాత ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ చేశారు.
అయితే ఇంటికి వెళ్లిన కొద్దిరోజులకే సంధ్య తీవ్ర కడుపునొప్పితో పాటు పలు అనారోగ్య సమస్యలతో బాధపడటం ప్రారంభించారు. రోజురోజుకూ ఆమె ఆరోగ్యం క్షీణించడంతో కుటుంబ సభ్యులు ఆమెను ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. అక్కడ వైద్యులు నిర్వహించిన స్కానింగ్‌లో ఆమె కడుపులో కొన్ని వస్తువులు ఉన్నట్లు గుర్తించారు.
పరిస్థితి ఆందోళనకరంగా ఉండటంతో సంధ్యను పుణెలోని సాసూన్ ఆస్పత్రికి తరలించారు. అక్కడ వైద్యులు మరోసారి శస్త్రచికిత్స నిర్వహించగా.. ఆమె కడుపులో గ్లౌజులు, పేపర్ వైప్స్ ఉన్నట్లు గుర్తించినట్లు సమాచారం. వాటిని తొలగించిన అనంతరం ఆమెకు చికిత్స కొనసాగిస్తున్నారు.
తన భార్యకు ఎదురైన పరిస్థితికి బీడ్ జిల్లా ఆస్పత్రిలో జరిగిన తొలి శస్త్రచికిత్సలోని నిర్లక్ష్యమే కారణమని సంధ్య భర్త సూరజ్ గైక్వాడ్ ఆరోపించారు. బాధ్యులైన వైద్యులు, సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.
ఈ ఘటన ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లడంతో వైద్యుల నిర్లక్ష్యంపై విచారణకు ఆదేశించారు. ఇందుకోసం ప్రత్యేక విచారణ కమిటీని ఏర్పాటు చేసినట్లు సమాచారం. కమిటీ నివేదిక ఆధారంగా బాధ్యులపై తదుపరి చర్యలు తీసుకునే అవకాశం ఉంది. ఘటనపై పూర్తి వివరాలు, బాధ్యత ఎవరిదన్నది విచారణ అనంతరం స్పష్టత రానుంది.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsToday NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews WorldNews



















