కర్నూలు టౌన్: కర్నూలు జిల్లా సంతోష్‌నగర్‌లో గురువారం జరిగిన పట్టపగలే చోరీ స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. సంతోష్‌నగర్‌కు చెందిన లక్ష్మీదేవి ఇంటికి తాళం వేసి తన కుమార్తెతో కలిసి పనుల నిమిత్తం బయటకు వెళ్లారు. కొంతసేపటి తర్వాత ఇంటికి తిరిగి వచ్చేసరికి తాళం పగులగొట్టి ఉండటాన్ని గమనించారు.
ఇంట్లోకి ప్రవేశించిన వెంటనే అక్కడ ఉన్న ఇద్దరు గుర్తుతెలియని వ్యక్తులు తల్లీ-కుమార్తెను తోసేసి వేగంగా పరారయ్యారు. ఈ ఘటనలో లక్ష్మీదేవికి స్వల్ప గాయాలయ్యాయి. ఇంట్లో ఉన్న బీరువాను పగులగొట్టి అందులో భద్రపరిచిన సుమారు 14 తులాల బంగారాన్ని దుండగులు చోరీ చేసినట్లు బాధితులు తెలిపారు.
సమాచారం అందుకున్న నాలుగో పట్టణ పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. పరిసర ప్రాంతాల్లోని సీసీ కెమెరా ఫుటేజ్‌ను పరిశీలిస్తూ దుండగుల ఆచూకీ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. పట్టపగలే జరిగిన ఈ చోరీతో స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తూ, పోలీస్ పేట్రోలింగ్‌ను మరింత పెంచాలని కోరుతున్నారు.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsToday NewsUpdate PoliticalNews PublicSafety shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews WorldNews



















