ధనుష్ ఇటీవల ‘కర’ చిత్రంలో దొంగ పాత్రలో ప్రేక్షకులను అలరించారు. ఇప్పుడు ఆయన ఎర్రచందనం అక్రమ రవాణా నేపథ్యంలో సాగే ఓ కొత్త సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.
ఈ చిత్రాన్ని రాజ్‌కుమార్ పెరియసామి దర్శకత్వం వహిస్తున్నారు. ధనుష్ ప్రధాన పాత్రలో నటిస్తుండగా, సాయి పల్లవి మరియు శ్రీలీల కథానాయికలుగా కనిపించనున్నారు. వర్కింగ్ టైటిల్‌గా ‘D55’గా ప్రారంభమైన ఈ ప్రాజెక్ట్‌కు ఇప్పుడు అధికారికంగా ‘ఓం’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు.
చిత్రబృందం గురువారం గ్లింప్స్‌ను ఇన్‌స్టాగ్రామ్‌లో విడుదల చేస్తూ కీలక ప్రకటన చేసింది. “అతని రాక అగ్నిజ్వాలలను రగిలిస్తోంది. అక్టోబర్ 16న థియేటర్లలో ఒక ఉద్వేగభరితమైన ప్రయాణం మీ కోసం వేచి ఉంది” అని పేర్కొంది.
అలాగే ఈ కథను రెండు భాగాలుగా తెరకెక్కించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ‘Chapter 1: ఉదిరమ్ – ది బ్లడ్ వుడ్’ అనే ట్యాగ్‌లైన్ కూడా ప్రస్తావనలో ఉంది.
ఈ చిత్రంలో ప్రముఖ నటుడు మమ్ముట్టి కీలక పాత్రలో కనిపించనున్నారు. ఈ సినిమాను వండర్‌బార్ ఫిల్మ్స్ నిర్మిస్తోంది.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsToday NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews WorldNews



















