ఆసియా క్రీడల్లో భారత టేబుల్ టెన్నిస్ జట్టులో స్టార్ ప్లేయర్ మనిక బత్రా చోటు కోల్పోవడం క్రీడా వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. భారత టేబుల్ టెన్నిస్ సమాఖ్య (TTFI) ప్రకటించిన ఎంపిక విధాన ప్రమాణాలను అందుకోలేకపోవడంతో ఆమెను జట్టులో నుంచి తప్పించినట్లు సమాచారం.
సెప్టెంబర్ 9 నుంచి జపాన్ వేదికగా ప్రారంభమయ్యే ఆసియా క్రీడల కోసం ఎంపిక ప్రక్రియలో దేశవాళీ పోటీల్లో పాల్గొనకపోవడం మనిక బత్రాకు ప్రతికూలంగా మారింది. దీంతో టీటీఎఫ్‌ఐ ర్యాంకింగ్స్‌లో ఆమెకు తగిన స్థానం లభించలేదు. 2023 సెలక్షన్ విధానం ప్రకారం జాతీయ ర్యాంకింగ్‌కు 50 శాతం, ప్రపంచ ర్యాంకింగ్‌కు 40 శాతం వెయిటేజీ ఇవ్వగా, మిగిలిన 10 శాతం సెలక్షన్ కమిటీ నిర్ణయంపై ఆధారపడి ఉంటుంది.
ప్రస్తుతం అంతర్జాతీయ సింగిల్స్ ర్యాంకింగ్స్‌లో మనిక బత్రా 51వ స్థానంలో ఉండగా, ఆకుల శ్రీజ 45వ ర్యాంకుతో భారత మహిళా జట్టులో అగ్రస్థానంలో కొనసాగుతోంది. 2018 ఆసియా క్రీడల్లో మిక్స్‌డ్ డబుల్స్ విభాగంలో అచంటా శరత్ కమల్‌తో కలిసి చారిత్రాత్మక కాంస్య పతకం సాధించిన మనిక బత్రా, ఈసారి జట్టులో లేకపోవడం భారత్‌కు పెద్ద నష్టంగా భావిస్తున్నారు.
మనిక బత్రా లేకపోవడంతో ఆకుల శ్రీజపై భారత జట్టు ప్రధాన ఆశలు పెట్టుకుంది. మహిళల జట్టులో యశస్విని ఘోర్‌పడే, దివ్య దేశ్‌ముఖ్, సుతీర్థ ముఖర్జీ, సిండ్రెలా దాస్‌లు చోటు దక్కించుకున్నారు. పురుషుల జట్టులో సత్యన్ జ్ఞానశేఖరన్, హర్మీత్ దేశాయ్, మానవ్ ఠక్కర్, మనుష్ షా, పయాస్ జైన్ ఉన్నారు. రిజర్వ్ ఆటగాళ్లుగా అంకుర్, రోనిత్‌లను ఎంపిక చేశారు.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsToday NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews WorldNews



















