గురుగ్రామ్‌లోని విలాసవంతమైన గృహ సముదాయంలో ఓ పెంట్‌హౌస్ ఏకంగా రూ.271 కోట్లకు విక్రయమైంది. స్థిరాస్తి సంస్థ డీఎల్‌ఎఫ్ ఈ భారీ విలువైన డీల్‌ను పూర్తి చేసినట్లు సమాచారం. పారిశ్రామికవేత్త మానవ్ సర్దానా ఈ పెంట్‌హౌస్‌ను కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది.
ఈ పెంట్‌హౌస్ మొత్తం 17,200 చదరపు అడుగుల సూపర్ ఏరియా, 10,500 చదరపు అడుగుల కార్పెట్ ఏరియా కలిగి ఉంది. చదరపు అడుగుకు సుమారు రూ.1.58 లక్షల చొప్పున విక్రయం జరిగినట్లు సమాచారం.
గురుగ్రామ్ డీఎల్‌ఎఫ్ ఫేజ్-5లో 17 ఎకరాల్లో ‘ది డాలియాస్’ పేరుతో ఈ లగ్జరీ ప్రాజెక్టును 2024 అక్టోబర్‌లో ప్రారంభించారు. ఇందులో మొత్తం 420 అపార్ట్‌మెంట్లు, పెంట్‌హౌస్‌లు ఉన్నాయి. ఇప్పటివరకు 65 శాతానికి పైగా యూనిట్లను కంపెనీ విక్రయించినట్లు తెలుస్తోంది.
ఈ ప్రాజెక్టులోని ఇతర అపార్ట్‌మెంట్ల ధరలు సైతం రూ.100 కోట్ల నుంచి రూ.170 కోట్ల మధ్య ఉన్నట్లు సమాచారం. కొవిడ్ తర్వాత దేశంలోని ప్రధాన నగరాల్లో విలాసవంతమైన గృహాలకు డిమాండ్ పెరగడంతో ఇలాంటి భారీ విలువైన రియల్ ఎస్టేట్ లావాదేవీలు ఎక్కువగా నమోదవుతున్నాయి.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsToday NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews WorldNews



















