టీవీకే అధ్యక్షుడు విజయ్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసిన డీఎంకే ఎమ్మెల్యే అనితా ఆర్. రాధాకృష్ణన్‌ను పోలీసులు అరెస్టు చేశారు. ముందస్తు బెయిల్ కోసం ఆయన చేసిన అభ్యర్థనను మద్రాస్ హైకోర్టు తిరస్కరించడంతో అరెస్టు జరిగినట్లు అధికారులు తెలిపారు.
జూన్ 20న తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి ఎం. కరుణానిధి జయంతి సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో విజయ్‌పై రాధాకృష్ణన్ అభ్యంతరకర వ్యాఖ్యలు చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. చిత్ర పరిశ్రమ నుంచి ఆయన రాజకీయ ప్రవేశాన్ని ఉద్దేశించి వ్యంగ్య వ్యాఖ్యలు చేయడంతో పాటు ఓ నటి ప్రస్తావన కూడా తీసుకువచ్చినట్లు సమాచారం. ఈ వ్యాఖ్యల నేపథ్యంలో ఆయనపై కేసు నమోదు చేశారు.
తాజాగా హైకోర్టు బెయిల్ నిరాకరించడంతో పోలీసులు ఎమ్మెల్యేను అదుపులోకి తీసుకున్నారు. ఈ అరెస్టును డీఎంకే ఎంపీ కనిమొళి ఖండించారు. ప్రతిపక్షాలపై రాష్ట్ర ప్రభుత్వం అణచివేత చర్యలకు పాల్పడుతోందని ఆమె ఆరోపించారు.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsToday NewsUpdate PoliticalNews PublicSafety shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews WorldNews



















