దేశీయ మార్కెట్లు శుక్రవారం నష్టాలతో ప్రారంభమయ్యాయి. అంతర్జాతీయ మార్కెట్లలో కనిపిస్తున్న మిశ్రమ సంకేతాలతో పాటు దేశీయంగా ఐటీ రంగ షేర్లలో భారీ అమ్మకాలు సూచీలపై తీవ్ర ఒత్తిడిని కలిగించాయి. ఫలితంగా స్టాక్ మార్కెట్లు భారీ నష్టాల్లో కొనసాగుతున్నాయి.
సెన్సెక్స్ దాదాపు 800 పాయింట్లు క్షీణించగా, నిఫ్టీ 24 వేల మైలురాయిని కోల్పోయింది. దీంతో మదుపర్ల సంపద సుమారు రూ.2 లక్షల కోట్ల మేర ఆవిరైనట్లు అంచనా వేస్తున్నారు. ఉదయం 9.30 గంటల సమయంలో సెన్సెక్స్ 783 పాయింట్ల నష్టంతో 76,627 వద్ద, నిఫ్టీ 218 పాయింట్లు తగ్గి 23,949 వద్ద ట్రేడింగ్‌లో కొనసాగింది. రూపాయి విలువ డాలర్‌తో పోలిస్తే 10 పైసలు పెరిగి 94.30 వద్ద స్థిరపడింది.
సెక్టార్ వారీగా చూస్తే, నిఫ్టీ ఐటీ సూచీ అత్యధిక ఒత్తిడిని ఎదుర్కొంది. యాక్సెంచర్ సంస్థ తన ఆదాయ వృద్ధి అంచనాలను తగ్గించడం, భవిష్యత్తులో డిమాండ్ బలహీనంగా ఉండొచ్చని హెచ్చరించడం ఈ రంగంపై ప్రతికూల ప్రభావం చూపింది. దీంతో ఐటీ సూచీ 6 శాతానికి పైగా పడిపోయింది. ఇన్ఫోసిస్ షేర్లు 7.3 శాతం నష్టంతో ట్రేడ్ అవుతుండగా, టీసీఎస్, టెక్ మహీంద్రా షేర్లు 6 శాతం చొప్పున క్షీణించాయి. హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ 5.5 శాతం, విప్రో 4 శాతం మేర పడిపోయాయి. అమెరికా మార్కెట్లలో కూడా యాక్సెంచర్ షేర్లు 17 శాతం మేర భారీగా క్షీణించడం గమనార్హం.
ఇతర రంగాల్లో మిశ్రమ పరిస్థితి కనిపించింది. నిఫ్టీలో అదానీ ఎంటర్‌ప్రైజెస్, సిప్లా, బజాజ్ ఆటో, ఐసీఐసీఐ బ్యాంక్, మ్యాక్స్ హెల్త్‌కేర్ షేర్లు కొంత మేర రాణించాయి. అయితే మొత్తం మార్కెట్ సెంటిమెంట్ బలహీనంగా ఉండటంతో సూచీలు ఒత్తిడిలోనే కొనసాగుతున్నాయి.
ఆసియా పసిఫిక్ మార్కెట్లు శుక్రవారం మిశ్రమంగా కదలాడాయి. దక్షిణ కొరియా కోస్పి 2.8 శాతం, జపాన్ నిక్కీ 0.6 శాతం పెరగగా, ఆస్ట్రేలియా ఏఎస్‌ఎక్స్ 0.74 శాతం నష్టంతో ట్రేడింగ్‌లో కొనసాగింది. అమెరికా మార్కెట్లు గురువారం లాభాలతో ముగిశాయి.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government India IndiaNews InternationalNews LatestNews LawAndOrder MarketUpdate News news24 newsalert NewsToday NewsUpdate PoliticalNews PublicSafety shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews WorldNews



















