బాలీవుడ్‌లో ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ‘డాన్ 3’ సినిమా చుట్టూ మరోసారి చర్చలు వేడెక్కాయి. ఈ ఫ్రాంచైజీలో మళ్లీ షారుక్ ఖాన్ ఎంట్రీ ఇస్తే బాగుంటుందని అభిమానులు కోరుకుంటుండగా, తాజా పరిణామాలు ఆ ఊహాగానాలకు మరింత బలం చేకూర్చుతున్నాయి.
గతంలో ‘డాన్’ రెండు భాగాల్లో షారుక్ ఖాన్ తన అద్భుతమైన నటనతో టైటిల్ పాత్రకు ప్రత్యేక గుర్తింపు తెచ్చారు. అయితే మూడో భాగం స్క్రిప్ట్ విషయంలో అసంతృప్తి వ్యక్తం చేస్తూ ఆయన ఈ ప్రాజెక్ట్‌ను తిరస్కరించినట్లు వార్తలు వచ్చాయి. ఆ తర్వాత ఈ సిరీస్ బాధ్యతలను రణ్‌వీర్ సింగ్‌కు అప్పగించారు. కానీ తాజా సమాచారం ప్రకారం రణ్‌వీర్ కూడా ఈ ప్రాజెక్ట్ నుంచి వైదొలిగినట్లు ప్రచారం జరుగుతోంది.
ఈ నేపథ్యంలో ‘డాన్ 3’ మేకర్స్ మళ్లీ షారుక్ ఖాన్‌తో చర్చలు జరుపుతున్నారని బాలీవుడ్ వర్గాల్లో జోరుగా టాక్ నడుస్తోంది. అంతేకాకుండా షారుక్ ఈ ప్రాజెక్ట్‌కు ఓ ఆసక్తికరమైన కండిషన్ పెట్టినట్లు కూడా సమాచారం. తనకు భారీ విజయాన్ని అందించిన ‘జవాన్’ దర్శకుడు అట్లీని ఈ ఫ్రాంచైజీలో భాగం చేస్తేనే మళ్లీ ‘డాన్’ పాత్రలో నటించడానికి సిద్ధమని ఆయన చెప్పినట్లు ప్రచారం జరుగుతోంది.
అయితే దీనిపై అధికారిక ప్రకటన ఇంకా వెలువడలేదు. ఇదే సమయంలో చిత్రంలోని ఇతర కాస్టింగ్ విషయంలో కూడా స్పష్టత రాలేదు. హీరోయిన్‌గా మొదట కియారా అడ్వాణీ పేరు వినిపించినా, ఇప్పుడు ఆమె స్థానంలో కృతి సనన్ పేరు పరిశీలనలో ఉందని సమాచారం. అలాగే విలన్ పాత్ర కోసం విక్రాంత్ మాస్సే, విజయ్ దేవరకొండ వంటి నటులను సంప్రదించినట్లు టాక్ వినిపిస్తోంది.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EntertainmentNews Geopolitics Government India IndiaNews InternationalNews LatestNews LawAndOrder MarketUpdate News news24 newsalert NewsToday NewsUpdate PoliticalNews PublicSafety shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews TrendingNow ViralNews WorldNews



















