ఇరాన్ ఓడిపోయేవరకు యుద్ధం కొనసాగించాలని గల్ఫ్ దేశాలు కోరుకుంటున్నాయట (Iran war). ప్రస్తుత పాలనాయంత్రాంగం పూర్తిగా కూలిపోయేవరకు యుద్ధం ముగించవద్దని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ను ప్రైవేట్‌గా కోరాయట. అలా కోరిన దేశాల జాబితాలో సౌదీ అరేబియా, యూఏఈ, కువైట్, బహ్రెయిన్ ఉన్నాయని అసోసియేటెడ్ ప్రెస్ సంచలన కథనం వెల్లడించింది.
‘‘నెల రోజులుగా జరుగుతోన్న యుద్ధంలో ఇరాన్ చెప్పుకోదగ్గ స్థాయిలో బలహీనపడలేదు. ఇరాన్ (Iran) నాయకత్వంలో గణనీయమైన మార్పు రావాలి. అప్పటివరకు సైనికచర్య ముగియకూడదు’’ అని ఆ దేశాల అధికారులు ప్రైవేటు సంభాషణలో భాగంగా ట్రంప్ (Donald Trump)ను కోరారని ఆ వార్తా ఏజెన్సీ కథనం వెల్లడించింది. ఈ మేరకు అమెరికా, ఇజ్రాయెల్, గల్ఫ్ అధికారులను ఉటంకించింది. ఇరాన్‌పై దాడి గురించి ముందస్తు సమాచారం ఇవ్వకపోవడంపై, యుద్ధం కారణంగా సంభవించే హెచ్చరికలను పట్టించుకోకపోవడంపై ఈ చర్చల సందర్భంగా ఆయా దేశాలు అసంతృప్తి వ్యక్తంచేశాయట. ఈ ఘర్షణలు ఎలాగూ కొనసాగుతున్నాయి గనక.. టెహ్రాన్‌లోని మతపెద్దల పాలనను పూర్తిగా కూలదోయడానికి ఇదొక చరిత్రాత్మక అవకాశమని కొన్ని దేశాలు అభిప్రాయం వ్యక్తం చేశాయని పేర్కొంది. హర్మూజ్‌లో అధికారికంగా టోల్ వసూలు.. ఎంతో తెలుసా..?
హర్మూజ్ గురించి నాకెందుకు.. ఎపిక్ ఫ్యూరీని ఆపేస్తా..!అమెరికా ‘ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ’తో యుద్ధరంగంలోకి దిగడంతో ఇరాన్ హర్మూజ్ జలసంధిని మూసివేసిన సంగతి తెలిసిందే. దానిని తెరిపిస్తామని ట్రంప్ (Donald Trump) ప్రకటనలు చేశారు. అయితే ఇప్పుడు వాటికి భిన్నమైన కథనాన్ని వాల్‌స్ట్రీట్ జర్నల్ రాసుకొచ్చింది. ఇరాన్‌పై సైనిక చర్యను ముగించడానికి తాను సిద్ధంగా ఉన్నానని సన్నిహితుల వద్ద వ్యాఖ్యానించినట్లు తెలుస్తోంది. హర్మూజ్ ఇప్పటికీ మూతపడే ఉన్నా.. ట్రంప్ ఈ ఆలోచన చేస్తున్నారట. ఈ కథనాలు ఇలాఉంటే.. మరోవైపు పశ్చిమాసియాలో అమెరికా బలగాల మోహరింపులు పెరుగుతుండటం గమనార్హం.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsToday NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews WorldNews



















