ShivaSakthi News
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు
No Result
View All Result
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు
ShivaSakthi News
No Result
View All Result
ShivaSakthi News
No Result
View All Result
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు

‘షమీ బౌలింగ్‌ను గమనించాం.. ఎదుర్కొనేందుకు సిద్ధం’.. తిలక్‌ వర్మ

September 5, 2026
in Sports News, News
0
‘షమీ బౌలింగ్‌ను గమనించాం.. ఎదుర్కొనేందుకు సిద్ధం’.. తిలక్‌ వర్మ

‘షమీ బౌలింగ్‌ను గమనించాం.. ఎదుర్కొనేందుకు సిద్ధం’.. తిలక్‌ వర్మ

Share on FacebookShare on TwitterShare on Whatsapp

దులీప్‌ ట్రోఫీ ఫైనల్‌కు రంగం సిద్ధమైంది. ఆదివారం నుంచి ఈస్ట్‌ జోన్‌, సౌత్‌ జోన్‌ జట్ల మధ్య తుది పోరు ప్రారంభం కానుంది. తిలక్‌ వర్మ నాయకత్వంలోని సౌత్‌ జోన్‌ జట్టు ఫైనల్‌లో బలమైన ప్రదర్శనపై కన్నేసింది. స్టార్‌ పేసర్‌ మహ్మద్‌ సిరాజ్‌, బ్యాటర్‌ దేవదత్‌ పడిక్కల్‌ జట్టులో ఆడటం ఖాయంగా కనిపిస్తుండగా.. కేఎల్‌ రాహుల్‌ మాత్రం ఫైనల్‌కు దూరంగా ఉంటాడని తిలక్‌ వర్మ స్పష్టం చేశాడు.

ఫైనల్‌కు ముందు ఇరు జట్ల కెప్టెన్లు తిలక్‌ వర్మ, ఇషాన్‌ కిషన్‌ మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ప్రత్యర్థి జట్టులోని సీనియర్‌ పేసర్‌ మహ్మద్‌ షమీ గురించి తిలక్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. షమీని ఎదుర్కొనేందుకు తమ జట్టు సిద్ధంగా ఉందని చెప్పాడు. గత మ్యాచ్‌లో అతడి బౌలింగ్‌ను నిశితంగా పరిశీలించామని, లైన్‌ అండ్‌ లెంగ్త్‌తో బ్యాటర్లను ఇబ్బంది పెట్టే షమీ బౌలింగ్‌ను సమర్థంగా ఎదుర్కొని సత్తా చాటుతామని తిలక్‌ పేర్కొన్నాడు.

మరోవైపు ఇషాన్‌ కిషన్‌ కూడా షమీపై ప్రశంసలు కురిపించాడు. బెంగాల్‌ తరఫున ఆడినప్పటి నుంచే షమీ అత్యుత్తమ ప్రదర్శన చేస్తున్నాడని చెప్పాడు. వికెట్లు తీయడంతోపాటు మైదానంలో పూర్తి శక్తిని వినియోగించే ఆటగాడని కొనియాడాడు. భారత క్రికెట్‌కు షమీ ఎన్నో సేవలు అందించాడని గుర్తుచేశాడు.

ప్రస్తుతం షమీ వయసుపై చర్చ జరుగుతున్నా.. వయసు అనేది కేవలం ఒక సంఖ్య మాత్రమేనని ఇషాన్‌ అన్నాడు. అతడి కష్టాన్ని, ఆటపై ఉన్న అంకితభావాన్ని కూడా గుర్తించాలని పేర్కొన్నాడు. ఇప్పటికీ షమీలో వికెట్లు సాధించాలనే ఆకలి తగ్గలేదని చెప్పాడు. దీంతో ఫైనల్‌లో షమీ బౌలింగ్‌ ఎలా ఉండబోతోందన్న ఆసక్తి నెలకొంది.

షమీతో పాటు యువ సంచలనం వైభవ్‌ సూర్యవంశీ ప్రదర్శనపైనా అందరి దృష్టి ఉంది. సెమీఫైనల్‌లో ఆకట్టుకునే ఇన్నింగ్స్‌ ఆడిన వైభవ్‌.. తుది పోరులోనూ అదే దూకుడును కొనసాగిస్తాడా అనేది ఆసక్తికరంగా మారింది. అనుభవం, యువ ప్రతిభ కలయికతో ఈస్ట్‌ జోన్‌ బలంగా కనిపిస్తోంది.

ఇదిలా ఉంటే, టీమిండియా చీఫ్‌ సెలక్టర్‌ అజిత్‌ అగార్కర్‌ దులీప్‌ ట్రోఫీ ఫైనల్‌ను వీక్షించేందుకు చెన్నై వెళ్లనున్నట్లు సమాచారం. ఆయన పదవీకాలం అక్టోబర్‌ 4తో ముగియనున్నప్పటికీ.. వచ్చే ఏడాది వన్డే ప్రపంచకప్‌ వరకు పొడిగించే అవకాశం ఉందనే చర్చ జరుగుతోంది. ఈ అంశంపై బీసీసీఐ కార్యదర్శి దేవజిత్‌ సైకియాతో అగార్కర్‌ సమావేశం కానున్నట్లు తెలుస్తోంది.

ఇక ఆసియా క్రీడల కోసం భారత జట్టు మరో రెండు వారాల్లో జపాన్‌కు వెళ్లనుంది. ప్రధాన జట్టుతో పాటు అదనపు నెట్‌ బౌలర్లను కూడా పంపించాలని మేనేజ్‌మెంట్‌ భావిస్తున్నట్లు సమాచారం. మయాంక్‌ యాదవ్‌, కార్తిక్‌ త్యాగి, మోసిన్‌ ఖాన్‌లకు ఈ అవకాశం దక్కవచ్చని తెలుస్తోంది. ఆసియా క్రీడలకు భారత హెడ్‌ కోచ్‌గా వ్యవహరించనున్న వీవీఎస్‌ లక్ష్మణ్‌ సూచన మేరకు ఈ నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని సమాచారం

Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews Wellness WorldNews

Tags: Ajit AgarkarDevajit SaikiaDuleep Trophy 2026Duleep Trophy FinalEast ZoneIshan KishanKartik TyagiKL RahulMayank YadavMohammed Shamishivasakthi newsshivasakthimediaSouth ZoneTilak VarmaVaibhav Sooryavanshi
ShareTweetSend
Previous Post

మావోయిస్టుల మెరుపుదాడి కేసులో తీర్పు.. 10 మందిని దోషులుగా తేల్చిన ఎన్‌ఐఏ కోర్టు

Next Post

సింధూ జలాల వినియోగంపై భారత్‌ కీలక అడుగు.. లద్దాఖ్‌లో రాతి చెక్‌డ్యామ్‌

Related Posts

ఖర్గ్‌ ఐలాండ్‌ వద్ద భారీ పేలుళ్లు.. ఇరాన్‌ ట్యాంకర్‌ను అమెరికా టార్గెట్‌ చేసిందా?
World News

ఖర్గ్‌ ఐలాండ్‌ వద్ద భారీ పేలుళ్లు.. ఇరాన్‌ ట్యాంకర్‌ను అమెరికా టార్గెట్‌ చేసిందా?

September 5, 2026
తెరిచి ఉన్న పాచికలపై పట్టు ఉంటే.. రీజనింగ్‌లో మార్కులు పక్కా!
Education

తెరిచి ఉన్న పాచికలపై పట్టు ఉంటే.. రీజనింగ్‌లో మార్కులు పక్కా!

September 5, 2026
ఓటర్‌ జాబితా సవరణ.. 35 ఏళ్లుగా దూరమైన అన్నదమ్ములను కలిపింది
India News

ఓటర్‌ జాబితా సవరణ.. 35 ఏళ్లుగా దూరమైన అన్నదమ్ములను కలిపింది

September 5, 2026
శంషాబాద్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. ఎయిర్‌పోర్ట్‌ ఉద్యోగిని మృతి
Crime News

శంషాబాద్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. ఎయిర్‌పోర్ట్‌ ఉద్యోగిని మృతి

September 5, 2026
‘గూఢచారి 2’ చూశా.. షాకయ్యా: దర్శకుడు రాహుల్‌ రవీంద్రన్‌
Movies

‘గూఢచారి 2’ చూశా.. షాకయ్యా: దర్శకుడు రాహుల్‌ రవీంద్రన్‌

September 5, 2026
టీచర్స్‌ డే సందర్భంగా సచిన్‌ గొప్ప ప్రకటన.. తండ్రి పేరిట ఫెలోషిప్‌
Sports News

టీచర్స్‌ డే సందర్భంగా సచిన్‌ గొప్ప ప్రకటన.. తండ్రి పేరిట ఫెలోషిప్‌

September 5, 2026
Next Post
సింధూ జలాల వినియోగంపై భారత్‌ కీలక అడుగు.. లద్దాఖ్‌లో రాతి చెక్‌డ్యామ్‌

సింధూ జలాల వినియోగంపై భారత్‌ కీలక అడుగు.. లద్దాఖ్‌లో రాతి చెక్‌డ్యామ్‌

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

I agree to the Terms & Conditions and Privacy Policy.

Live Cricket Score

Live Cricket Scores

Career

  • Trending
  • Comments
  • Latest
meenam

రాశి ఫలాలు – మీనం

September 5, 2026
రాశి ఫలాలు – మేషం

రాశి ఫలాలు – మేషం

September 5, 2026
రేపు శని త్రయోదశి , శని త్రయోదశి నాడు ఏమి చేస్తే శనీశ్వర దేవుడు సంతృప్తి చెందుతాడు ?

రేపు శని త్రయోదశి , శని త్రయోదశి నాడు ఏమి చేస్తే శనీశ్వర దేవుడు సంతృప్తి చెందుతాడు ?

October 3, 2025
5 సెప్టెంబర్ 2026 (శనివారం)

పంచాంగం: 5 సెప్టెంబర్ 2026 (శనివారం)

September 5, 2026
చెస్‌లో ప్రపంచ రికార్డు అందుకున్న నారా దేవాంశ్‌.. స్పందించిన తండ్రి లోకేశ్‌

చెస్‌లో ప్రపంచ రికార్డు అందుకున్న నారా దేవాంశ్‌.. స్పందించిన తండ్రి లోకేశ్‌

0
అమెరికాకు షాకిచ్చిన చైనా.. చర్చల వేళ రెండు దర్యాప్తులు మొదలు..!

సీన్ రివర్స్: అమెరికాపై చైనా ఎదురుదాడి.. సెమీకండక్టర్లపై రెండు కీలక దర్యాప్తులు!

0
తిరుపతిలో అత్యాధునిక బస్ స్టేషన్‌ నిర్మాణం: సీఎం చంద్రబాబు

తిరుపతిలో అత్యాధునిక బస్ స్టేషన్‌ నిర్మాణం: సీఎం చంద్రబాబు

0
ప్రైవేట్‌ విద్యాసంస్థల యాజమాన్యాలతో చర్చలు జరిపిన తెలంగాణ ప్రభుత్వం

ప్రైవేట్‌ విద్యాసంస్థల యాజమాన్యాలతో చర్చలు జరిపిన తెలంగాణ ప్రభుత్వం

0
తెరిచి ఉన్న పాచికలపై పట్టు ఉంటే.. రీజనింగ్‌లో మార్కులు పక్కా!

తెరిచి ఉన్న పాచికలపై పట్టు ఉంటే.. రీజనింగ్‌లో మార్కులు పక్కా!

September 5, 2026
ఓటర్‌ జాబితా సవరణ.. 35 ఏళ్లుగా దూరమైన అన్నదమ్ములను కలిపింది

ఓటర్‌ జాబితా సవరణ.. 35 ఏళ్లుగా దూరమైన అన్నదమ్ములను కలిపింది

September 5, 2026
శంషాబాద్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. ఎయిర్‌పోర్ట్‌ ఉద్యోగిని మృతి

శంషాబాద్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. ఎయిర్‌పోర్ట్‌ ఉద్యోగిని మృతి

September 5, 2026
‘గూఢచారి 2’ చూశా.. షాకయ్యా: దర్శకుడు రాహుల్‌ రవీంద్రన్‌

‘గూఢచారి 2’ చూశా.. షాకయ్యా: దర్శకుడు రాహుల్‌ రవీంద్రన్‌

September 5, 2026

Recent News

ShivaSakthi.Net

Stay updated with the latest Telugu news, breaking stories, and trending updates from across Andhra Pradesh, Telangana, and the world. A one-stop platform for politics, cinema, business, sports, and more

Follow Us

Browse by Category

  • Andhra Pradesh News
  • Blog
  • Business News
  • Crime News
  • Devotional News
  • Education
  • Entertainment News
  • Gold and Silver News
  • Health
  • India News
  • Lifestyle
  • Movies
  • News
  • Politics News
  • Rasi Phalalu
  • Recipes
  • Sports News
  • Stock Market News
  • Technology News
  • telangana news
  • Telangana News
  • Telugu Stories
  • World News

Recent News

తెరిచి ఉన్న పాచికలపై పట్టు ఉంటే.. రీజనింగ్‌లో మార్కులు పక్కా!

తెరిచి ఉన్న పాచికలపై పట్టు ఉంటే.. రీజనింగ్‌లో మార్కులు పక్కా!

September 5, 2026
ఓటర్‌ జాబితా సవరణ.. 35 ఏళ్లుగా దూరమైన అన్నదమ్ములను కలిపింది

ఓటర్‌ జాబితా సవరణ.. 35 ఏళ్లుగా దూరమైన అన్నదమ్ములను కలిపింది

September 5, 2026
  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact

© 2025 ShivaSakthi.Net

No Result
View All Result

© 2025 ShivaSakthi.Net

This website uses cookies. By continuing to use this website you are giving consent to cookies being used. Visit our Privacy and Cookie Policy.