నేపాల్‌లో ఇటీవల సంభవించిన ఆకస్మిక వరదలు, బురద ప్రవాహానికి కారణమేంటన్న దానిపై కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. భూకంపం, భారీ వర్షాలు లేదా హిమనీనదం కరిగిపోవడం వల్ల ఈ విపత్తు సంభవించలేదని.. ఎత్తైన ప్రాంతం నుంచి మంచు, రాళ్లు భారీగా విరిగిపడి నదుల్లోకి చేరడమే ప్రధాన కారణమని నేపాల్ పర్యావరణ సొసైటీ (ఎన్‌ఈఎస్) అధ్యయనం తేల్చింది.
రసువా జిల్లాలోని లాంగ్‌టంగ్ లైరుంగ్ ప్రాంతంలో సుమారు 5,200 మీటర్ల ఎత్తు నుంచి మంచు, రాళ్లు విస్ఫోటంలా దిగువకు దూసుకొచ్చాయి. అవి లిండే నదిలో పడటంతో పాటు భోటే కోశీ, త్రిశూలి నదీ వ్యవస్థల్లోకి చేరి దిగువ ప్రాంతాల్లోని గ్రామాలను ముంచెత్తినట్లు అధ్యయనం పేర్కొంది.
అధ్యయనం ప్రకారం.. బుధవారం ఉదయం 8.37 గంటల సమయంలో లాంగ్‌టంగ్ లైరుంగ్ వద్ద మంచు ఫలకం దిగువకు కదలడం ప్రారంభించింది. ఏటవాలుగా ఉన్న ప్రాంతం నుంచి వేగంగా జారిన మంచు, రాళ్లు సుమారు 2,930 మీటర్ల ఎత్తులో ఉన్న లిండే నదిలో పడిపోయాయి.
ఈ మంచు ఫలకం కేవలం 7 నిమిషాల్లో దాదాపు 22 కిలోమీటర్లు ప్రయాణించినట్లు పరిశోధకులు గుర్తించారు. ఈ సమయంలో దాని వేగం గంటకు సుమారు 167 కిలోమీటర్లుగా ఉన్నట్లు అంచనా వేశారు.
రసువాగధి ప్రాంతం నుంచి బెట్రబాతి వైపు ప్రవాహం గంటకు సుమారు 22 కిలోమీటర్ల వేగంతో కదిలినట్లు అధ్యయనం వెల్లడించింది. ఈ ఉప్పెనతో పాటు భారీ మొత్తంలో రాళ్లు, మట్టి, శిథిలాలు కొట్టుకొచ్చాయి. దీంతో నదీ పరివాహక ప్రాంతాల్లో తీవ్ర విధ్వంసం చోటుచేసుకుంది.
శాటిలైట్ చిత్రాలు, జల-వాతావరణ సమాచారం, నదీ వ్యవస్థ వెంట ఉన్న భూభాగం, ఎత్తు, వాలులను పరిశోధకులు విశ్లేషించారు. ఈ పరిశీలనల్లో ఎక్కడా సరస్సులు ఉప్పొంగినట్లు ఆధారాలు లభించలేదని తెలిపారు.
సుమారు 10 చదరపు కిలోమీటర్ల పరిధిలో భౌగోళిక మార్పులు చోటుచేసుకున్నట్లు శాటిలైట్ చిత్రాలు సూచించాయి. అయితే ఇందులో దాదాపు 0.56 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉన్న హిమనీనద ప్రాంతంలో విస్ఫోటం సంభవించినట్లు అధ్యయనం గుర్తించింది.
అంతేకాకుండా ఘటనకు ముందు భారీ వర్షపాతం నమోదైనట్లు కూడా ఆధారాలు లేవని పరిశోధకులు పేర్కొన్నారు. దీంతో సాధారణ వరదలకు భిన్నమైన ప్రకృతి ప్రక్రియ ఈ విపత్తుకు కారణమై ఉండొచ్చన్న అంచనాలకు బలం చేకూరింది.
మొదటి విస్ఫోటం జరిగిన సుమారు 3 గంటల 8 నిమిషాల తర్వాత మరో మోస్తరు పరిమాణంలోని మంచు ఫలకం దిగువకు వచ్చింది. అది కొంతసేపు చిన్నపాటి డ్యామ్‌లా ఏర్పడింది. అనంతరం అది కూడా విరిగిపడి ప్రవాహాన్ని పెం
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews Wellness WorldNews



















