డ్వాక్రా మహిళలను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో ఆహార శుద్ధి పరిశ్రమలను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుందని పేర్కొన్నారు.
ప్రధానమంత్రి ఫార్మలైజేషన్ ఆఫ్ మైక్రో ఫుడ్ ప్రాసెసింగ్ ఎంటర్‌ప్రైజెస్ (పీఎంఎఫ్‌ఎంఈ) పథకాన్ని స్త్రీనిధి క్రెడిట్ కో-ఆపరేటివ్ ఫెడరేషన్ లిమిటెడ్‌తో అనుసంధానిస్తున్నట్లు మంత్రి తెలిపారు. ఈ పథకం కింద అర్హత ఉన్న డ్వాక్రా మహిళలు రూ.3 లక్షల వరకు యూనిట్ వ్యయంతో ఆహార శుద్ధి యూనిట్లను ఏర్పాటు చేసుకునేందుకు స్త్రీనిధి రుణాన్ని పొందవచ్చని వివరించారు.
మహిళలు తమ ఆసక్తి, సామర్థ్యాన్ని బట్టి పండ్లు, కూరగాయల ప్రాసెసింగ్, చిరుధాన్యాలు, పప్పులు, మసాలాలు, పచ్చళ్లు, పిండి పదార్థాలు, స్నాక్స్ తదితర ఆహార ఉత్పత్తుల తయారీ యూనిట్లను ఏర్పాటు చేసుకోవచ్చని తెలిపారు.
ప్రతి జిల్లాలోని జిల్లా సమాఖ్యలను జిల్లా వనరుల సంస్థలుగా పరిగణించి, వాటి ద్వారా ఆసక్తి, సామర్థ్యం ఉన్న డ్వాక్రా మహిళలను గుర్తించనున్నట్లు మంత్రి వెల్లడించారు. మహిళలకు కేవలం రుణం అందించడంతో ప్రభుత్వం బాధ్యత ముగియదని, వారు ఏర్పాటు చేసుకున్న వ్యాపారం విజయవంతంగా కొనసాగేవరకు అవసరమైన సహకారం అందిస్తామని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమం ద్వారా గ్రామీణ మహిళలకు స్వయం ఉపాధి అవకాశాలు పెరగడంతో పాటు స్థానికంగా ఆహార ఉత్పత్తుల తయారీ, విలువ ఆధారిత ఉత్పత్తులకు ప్రోత్సాహం లభించే అవకాశం ఉంది.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsToday NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews WorldNews



















