తెలంగాణలో ఉద్యోగులు, పెన్షనర్లకు అమలు చేయాల్సిన ఆరోగ్య పథకం (ఈహెచ్‌ఎస్) సేవలను తక్షణమే ప్రారంభించాలని రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్ల ఐకాస ప్రభుత్వాన్ని కోరింది. ఈ నెల 15 నుంచే ఈహెచ్‌ఎస్ సేవలు అందుబాటులోకి తీసుకురావాలని విజ్ఞప్తి చేసింది.
హైదరాబాద్‌లో ఐకాస ఛైర్మన్ కె.లక్ష్మయ్య అధ్యక్షతన జరిగిన కోర్ కమిటీ సమావేశంలో ఉద్యోగులు, పెన్షనర్ల సమస్యలపై చర్చించారు. పెండింగ్‌లో ఉన్న కరువు భత్యం (డీఏ)లను వెంటనే విడుదల చేయాలని, పెండింగ్‌లో ఉన్న పీఆర్‌సీ అమలుపై ప్రభుత్వం స్పష్టమైన నిర్ణయం తీసుకోవాలని సమావేశంలో కోరారు.
ఈ సందర్భంగా లక్ష్మయ్య మాట్లాడుతూ.. ఉద్యోగులు, పెన్షనర్ల వేతనాల నుంచి రెండు నెలల పాటు ఆరోగ్య పథకం కోసం కోతలు విధించినప్పటికీ ఇప్పటివరకు ఈహెచ్‌ఎస్ సేవలు ప్రారంభం కాకపోవడం పట్ల అసంతృప్తి వ్యక్తం చేశారు. వెంటనే కొత్త ఆరోగ్య కార్డుల జారీ ప్రక్రియను ప్రారంభించి, వైద్య సేవలు సులభంగా పొందేలా చర్యలు తీసుకోవాలని కోరారు.
ఈహెచ్‌ఎస్ అమలు ఆలస్యం కావడంతో ఉద్యోగులు, పెన్షనర్లు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఐకాస నాయకులు తెలిపారు. ప్రభుత్వ ఆసుపత్రులతో పాటు ప్రైవేటు ఆసుపత్రుల్లోనూ నగదు రహిత వైద్య సేవలు పొందేలా పథకాన్ని సమర్థంగా అమలు చేయాలని డిమాండ్ చేశారు.
సమావేశంలో ఐకాస ప్రధాన కార్యదర్శి సత్యనారాయణతో పాటు నాయకులు శుభాకర్‌రావు, మోహన్‌నారాయణ, భరత్‌రెడ్డి, జ్ఞానేశ్వర్, ప్రసాద్, జయప్రకాశ్, జనార్ధన్ తదితరులు పాల్గొన్నారు. ఉద్యోగులు, పెన్షనర్ల సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వంతో చర్చలు కొనసాగిస్తామని ఐకాస నేతలు తెలిపారు.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews Wellness WorldNews



















