రాష్ట్రంలో తీవ్రమైన ఎండలు, వడగాలుల ప్రభావం కొనసాగుతోంది. పలు జిల్లాల్లో ఉష్ణోగ్రతలు ప్రమాదకర స్థాయికి చేరడంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
అత్యధికంగా ఆసిఫాబాద్ జిల్లా దహేగాంలో 46.3 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. అలాగే బెల్లంపల్లి, రామగుండం ప్రాంతాల్లో 46.2 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. దీంతో ఉత్తర తెలంగాణ జిల్లాల్లో ఉక్కపోత పరిస్థితులు నెలకొన్నాయి.
రాష్ట్రవ్యాప్తంగా తొమ్మిది జిల్లాల్లోని 46 మండలాల్లో వడగాలులు వీచినట్లు వాతావరణ శాఖ తెలిపింది. అత్యధికంగా మంచిర్యాల జిల్లాలో 9 మండలాల్లో వడగాలులు నమోదు కాగా, కుమురంభీం ఆసిఫాబాద్‌లో 8, పెద్దపల్లి 7, నిర్మల్ 6, జగిత్యాల 5, ఖమ్మం 3, మహబూబాబాద్ 3, సూర్యాపేట 3, ములుగు 2 మండలాల్లో తీవ్ర వడగాలుల ప్రభావం కనిపించింది.
వాతావరణ శాఖ హెచ్చరికల ప్రకారం శనివారం ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్ జిల్లాల్లో వడగాలులు కొనసాగనున్నాయి. ఆదివారం ఉత్తర, దక్షిణ, మధ్య తెలంగాణ జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. వచ్చే నెల 1వ తేదీ తర్వాత ఉష్ణోగ్రతలు స్వల్పంగా తగ్గే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.
ఇదే సమయంలో రాష్ట్రంలో వడదెబ్బతో మరణాలు కలకలం రేపాయి. శుక్రవారం ఒక్కరోజే 9 మంది వడదెబ్బతో మృతి చెందినట్లు అధికారులు తెలిపారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో నలుగురు, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఇద్దరు మరణించగా, సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలం చంద్లాపూర్‌లో ఉపాధి హామీ కూలీ ఇంద్రసేనారెడ్డి (55), సంగారెడ్డి జిల్లా కంగ్టి మండలం దెగుల్‌వాడి గ్రామ పంచాయతీ పారిశుద్ధ్య కార్మికురాలు సంగీత (36), నిజామాబాద్ నగరంలో రాచకొండ రాజు (38) వడదెబ్బతో మృతిచెందారు.
ప్రజలు మధ్యాహ్నం వేళల్లో బయటకు వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, తగినంత నీరు తాగుతూ వడగాలుల నుంచి రక్షణ చర్యలు పాటించాలని అధికారులు సూచిస్తున్నారు.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews Wellness WorldNews


















