సుప్రీంకోర్టు న్యాయమూర్తులుగా నియమితులైన ఐదుగురు న్యాయమూర్తులు మంగళవారం పదవీ బాధ్యతలు స్వీకరించారు. జస్టిస్ శీల్ నాగు, జస్టిస్ శ్రీచంద్రశేఖర్, జస్టిస్ సంజీవ్ సచ్‌దేవ, జస్టిస్ అరుణ్ పళ్లి, అలాగే సీనియర్ న్యాయవాది వి.ఎస్. మోహన్‌లు సుప్రీంకోర్టు ఆడిటోరియంలో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో ప్రమాణ స్వీకారం చేశారు.
ఈ కార్యక్రమంలో భారత ప్రధాన న్యాయమూర్తి (CJI) జస్టిస్ సూర్యకాంత్ వారితో పదవీ ప్రమాణం చేయించారు. సుప్రీంకోర్టు న్యాయమూర్తులంతా ఈ కార్యక్రమానికి హాజరై కొత్త న్యాయమూర్తులను అభినందించారు.
గత నెల 27న సుప్రీంకోర్టు కొలీజియం ఈ ఐదుగురి పేర్లను సిఫార్సు చేయగా, సోమవారం రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఆమోదం తెలిపారు. అనంతరం న్యాయశాఖ వెంటనే నియామక ఉత్తర్వులు జారీ చేసింది.
ఈ నియామకాలతో సుప్రీంకోర్టులో న్యాయమూర్తుల సంఖ్య 37కి చేరింది. న్యాయవ్యవస్థలో అనుభవజ్ఞులైన న్యాయమూర్తుల చేరికతో కేసుల విచారణ వేగవంతమవుతుందని అంచనా వేస్తున్నారు.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government India IndiaNews InternationalNews LatestNews LawAndOrder MarketUpdate News news24 newsalert NewsToday NewsUpdate PoliticalNews PublicSafety shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews WorldNews



















