డిగ్రీ చదువుతూనే పోస్ట్-డాక్టోరల్ రిసెర్చ్ ఫెలోషిప్ (PDF) ను భవిష్యత్తు లక్ష్యంగా పెట్టుకోవడం అభినందనీయం. అయితే, ఇది ఒక దీర్ఘకాలిక విద్య, పరిశోధన ప్రయాణం. చదువుపై ఆసక్తి, పరిశోధనలో నిబద్ధత ఉంటే మాత్రమే ఈ లక్ష్యాన్ని సాధించవచ్చు.
డిగ్రీ సమయంలో దశలు:
- డిగ్రీను కేవలం ఉత్తీర్ణత కోసం కాకుండా, సబ్జెక్ట్ విషయాలను పూర్తిగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి.
- ‘ఎందుకు?’ మరియు ‘ఎలా?’ అనే ప్రశ్నలు అడగడం ప్రారంభించండి. ఇవి భవిష్యత్తులో పరిశోధన వైపు మిమ్మల్ని తీసుకెళ్తాయి.
- తరగతి గదిలో నేర్చుకున్న విషయాలను నిజ జీవిత పరిస్థితులతో అనుసంధానం చేయడం సహాయపడుతుంది.
పోస్ట్ గ్రాడ్యుయేషన్ దశ:
- మంచి విద్యాసంస్థలో PG పూర్తి చేయాలి.
- పుస్తకాలు చదవడమే కాక, విషయాలను అన్వేషించడం, విశ్లేషించడం నేర్చుకోవాలి.
- ప్రాజెక్టులు, ఫీల్డ్ వర్క్‌లో పాల్గొనడం, డేటా అనాలిసిస్ నైపుణ్యాలను పెంపొందించడం అవసరం.
- మంచి అధ్యాపకుల మార్గదర్శకత్వం సహాయకరం.
- PG సమయంలో యూజీసీ/CSIR జూనియర్ రిసెర్చ్ ఫెలోషిప్ (JRF)/NET కోసం సన్నద్ధమవ్వాలి.
- JRF స్కోరుతో ప్రముఖ విశ్వవిద్యాలయం/సంస్థల్లో PhD ప్రవేశం సాధించవచ్చు, నెలకు ₹37,000-42,000 స్టైపెండ్ లభిస్తుంది. వసతి, HRA, కాంటింజెన్సీ గ్రాంట్ కూడా అందుతుంది.
PhD దశ:
- PhD డిగ్రీ కేవలం ఒక పట్టిక కాదు, కొత్త జ్ఞానం సృష్టించే అవకాశం.
- క్రమశిక్షణ, సహనం, ఆలోచన శక్తి అవసరం.
- పరిశోధన ఫలితాలను అంతర్జాతీయ రిసెర్చ్ జర్నల్స్‌లో ప్రచురించాలి.
- దేశీయ, అంతర్జాతీయ పరిశోధకులతో కలిసి పరిశోధన చేయడం ప్రాధాన్యం.
- ఆసక్తి ఉంటే విదేశాల్లో PG/PhD కోసం కూడా ఆలోచించవచ్చు.
Post-Doctoral Fellowship (PDF):PhD తర్వాతే PDFలో చేరడానికి అవకాశం ఉంటుంది.
పరిశోధనను మెరుగుపరచడం, ప్రపంచ స్థాయిలో గుర్తింపు పొందడం సాధ్యమవుతుంది.
విదేశీ విశ్వవిద్యాలయాలు, ప్రముఖ పరిశోధన సంస్థల్లో PDF చేసుకోవడం ఉత్తమం.
భారతదేశంలోని ప్రసిద్ధ సంస్థలలో PDFకు నెలకు ₹55,000-80,000 స్టైపెండ్ అందిస్తుంది, అదనంగా HRA కూడా లభిస్తుంది.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsToday NewsUpdate PoliticalNews PublicSafety shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews WorldNews

















