డ్రగ్ మాఫియా కింగ్‌గా పేరొందిన కరడుగట్టిన నేరస్థుడు ‘ఎల్ మెంమెక్సికోను వణికించిన కార్టెల్ చీఫ్ ఎల్ మెంచో కథ
చో’ మృతి నేపథ్యంలో Mexicoలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. తమ నాయకుడి మరణానికి ఆగ్రహంతో అతడి ముఠా సభ్యులు హింసకు దిగినట్లు సమాచారం. దుకాణాలకు నిప్పంటించడం, వాహనాలను దగ్ధం చేయడం వంటి ఘటనలు చోటుచేసుకుని పలు ప్రాంతాలు అల్లకల్లోలంగా మారాయి.
‘ఎల్ మెంచో’ అసలు పేరు Nemesio Oseguera Cervantes. 1966లో మిచోకాన్ రాష్ట్రంలోని ఓ గ్రామంలో జన్మించాడు. చిన్ననాటి నుంచి వ్యవసాయ పనుల్లో పాల్గొన్న అతడు, 1980లలో అక్రమంగా అమెరికాలోకి ప్రవేశించాడు. కాలిఫోర్నియాలో హెరాయిన్ సరఫరా చేస్తూ అమెరికా అధికారులకు చిక్కి జైలుశిక్ష అనుభవించాడు. అనంతరం అతడిని తిరిగి మెక్సికోకు పంపించారు.
స్వదేశానికి వచ్చిన తర్వాత కొంతకాలం పోలీసు విభాగంలో పనిచేసిన అతడు, ఆ సమయంలో ఏర్పరుచుకున్న పరిచయాలతో మాదకద్రవ్యాల అక్రమ రవాణా రంగంలోకి అడుగుపెట్టాడు. మొదట Sinaloa Cartelతో అనుబంధంగా పనిచేశాడు. తరువాత 2009లో స్వతంత్రంగా Jalisco New Generation Cartelను స్థాపించి శక్తివంతమైన కార్టెల్‌గా తీర్చిదిద్దాడు.ఈ కార్టెల్ అమెరికాకు ఫెంటనిల్ వంటి ప్రమాదకర మాదకద్రవ్యాల అక్రమ రవాణాలో కీలక పాత్ర పోషించినట్లు ఆరోపణలు ఉన్నాయి. దోపిడీలు, కిడ్నాప్‌లు, హత్యలు సహా అనేక ఘోర నేరాలకు ఈ ముఠా పాల్పడింది. 2015లో ఆరు వారాల్లోనే 20 మందికి పైగా పోలీసులను దారుణంగా హత్య చేసిన ఘటన దేశవ్యాప్తంగా కలకలం రేపింది.
డ్రగ్ కింగ్‌పిన్ Joaquín ‘El Chapo’ Guzmán తర్వాత మెక్సికోలో అత్యంత ప్రభావశీల నేర నేతగా ఎల్ మెంచో ఎదిగాడు. అయితే, ఎల్ చాపోలా మీడియా ముందుకు రాకుండా, అజ్ఞాతంలోనే తన నెట్‌వర్క్‌ను విస్తరించుకున్నాడు. గ్రామీణ ప్రాంతాల్లో దాక్కొని కార్యకలాపాలు కొనసాగించేవాడని చెబుతారు.ఇప్పటివరకు అతడిని పట్టుకునేందుకు అధికారులు పలుమార్లు ప్రయత్నించినా, కొన్ని సందర్భాల్లో తృటిలో తప్పించుకున్నాడు. సోషల్ మీడియాలో వీడియోలు విడుదల చేస్తూ ప్రత్యర్థులు, అధికారులను బెదిరించేవాడు. రాజకీయ వర్గాల్లోనూ అతడికి మద్దతు ఉన్నట్లు ప్రచారం సాగింది.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsToday NewsUpdate PoliticalNews PublicSafety shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews WorldNews



















