రాష్ట్రవ్యాప్తంగా వినాయక నిమజ్జనాలు ఉత్సాహంగా సాగుతున్న వేళ పలు ప్రాంతాల్లో విషాద ఘటనలు చోటుచేసుకున్నాయి. వేర్వేరు ప్రమాదాల్లో ముగ్గురు యువకులు మృతి చెందగా.. మరో యువకుడు నీటిలో గల్లంతయ్యాడు. నిమజ్జనం, శోభాయాత్రల సందర్భంగా చోటుచేసుకున్న ఈ ఘటనలు ఆయా కుటుంబాల్లో తీవ్ర విషాదాన్ని నింపాయి.
నిర్మల్ జిల్లా తానూరు మండలం ఎల్వి గ్రామానికి చెందిన నిర్వాహకులు వినాయకుడి నిమజ్జనం కోసం బాసరకు వెళ్లారు. నిమజ్జనం అనంతరం అందరూ భోజనాల కోసం సత్రానికి వెళ్లగా.. లోకండే విశాల్(25) ఎవరికీ చెప్పకుండా గోదావరి వద్దకు వెళ్లాడు. అక్కడ స్నానం చేస్తుండగా ప్రమాదవశాత్తు నీటిలో మునిగి మృతి చెందాడు.
జగిత్యాల జిల్లా ఎండపల్లి మండలం కొత్తపేటలో నిమజ్జన వేడుకల సందర్భంగా ఏర్పాటు చేసిన సౌండ్ బాక్సుల కనెక్షన్లు తొలగిస్తున్న సమయంలో ప్రమాదం జరిగింది. కనెక్షన్లు తొలగించే క్రమంలో కర్రకు విద్యుత్ ప్రసరించడంతో స్థానికుడైన కొప్పుల రాజశేఖర్(23) విద్యుదాఘాతానికి గురై మృతి చెందాడు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ గ్రామానికి చేరుకుని బాధిత కుటుంబాన్ని పరామర్శించారు.
కరీంనగర్ జిల్లా కొత్తపల్లి మండలం బద్దిపెల్లికి చెందిన వారు మల్కాపూర్ వంతెన వద్ద కాకతీయ కెనాల్‌లో గురువారం తెల్లవారుజామున వినాయక విగ్రహాలను నిమజ్జనం చేస్తున్నారు. ఈ సమయంలో అదే గ్రామానికి చెందిన తాండ్ర అహాన్ రుద్ర(16) ప్రమాదవశాత్తు కాలువలో పడిపోయాడు. సమాచారం అందుకున్న పోలీసులు, గజ ఈతగాళ్లు, రెస్క్యూ సిబ్బంది అక్కడికి చేరుకుని గాలింపు చేపట్టారు. అయితే అతడి ఆచూకీ లభించలేదు.
జగిత్యాలలోని తులసీనగర్‌లో నిర్వహించిన వినాయక శోభాయాత్రలో మరో విషాదం చోటుచేసుకుంది. తోపారపు జయంత్(48) గురువారం రాత్రి నృత్యం చేస్తూ ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. అక్కడే ఉన్న పోలీసులు వెంటనే సీపీఆర్ చేసి.. తమ వాహనంలో జగిత్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే ఆయన మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews Crime News EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews Wellness WorldNews



















